జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా వార్ 2. స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఇక హృతిక్ రోషన్ మెయిన్ లీడ్ లో చేస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక రా ఏజెంట్ పాత్రలో

 కనిపించబోతున్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమాలో వీళ్ళిద్దరితోపాటు మరొక ముఖ్యపాత్ర కూడా ఉండబోతోంది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ తమ్ముడిది అని తెలుస్తోంది. అయితే ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తమ్ముడి పాత్ర కోసం ఒక స్టార్ హీరోని రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు కన్నడ స్టార్ హీరో ధ్రువ్ సర్జ. ఈయన జూనియర్ ఎన్టీఆర్ కి తమ్ముడి పాత్రలో కనిపించనున్నట్లుగా సమాచారం వినబడుతోంది. అంతేకాదు

 ఈ పాత్రకి చాలా తక్కువ స్క్రీన్ టైం ఉంటుందని అంటున్నారు.  ఈ పాత్ర మధ్యలోనే చనిపోతుందట. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పాత్ర మొదలవుతుందని అంటున్నారు. తమ్ముడు కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇందులోకి ఎంట్రీ ఇస్తాడట. మరి తమ్ముడి కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తాడు అన్నదే సినిమా కథ అని అంటున్నారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్సినిమా తరువాత మరొక హిందీ సినిమా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే వార్ వన్ కంటే వార్ టు లో యాక్షన్ సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య  వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయట. అంతే కాదు వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు గూస్ బమ్స్ తెప్పించే లాగా ఉంటాయట. మరి ఇప్పుడే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయంటే సినిమా ఏ లెవెల్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: