పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో ఉన్న ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటించి బ్లాక్ పాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. కాగా ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. ఇప్పటికే మొదటి భాగం విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. దీంతో సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

 ప్రభాస్ అభిమానులు. అయితే మొదటి భాగం విడుదల కాకముందే సలార్ టు ఉంటుంది అని అది కూడా కేజీఎఫ్ సినిమాకి సలార్ టు కి మధ్య ఏదో సంబంధం ఉంటుంది అన్న వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇకపోతే ఇప్పుడు మాత్రం ఈ రెండు సినిమాల మధ్య ఎటువంటి కనెక్షన్ ఉండదు అని అంటున్నారు. ఇదివరకు సలార్ లో కేజిఎఫ్ సినిమాకి సంబంధించిన ఏ పాత్ర కూడా కనిపించలేదు. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సలార్ సెకండ్ పార్ట్ లో కేజీఎఫ్ సినిమాలో విలన్ గా నటించిన సంజయ్

 దత్ కనిపించబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక సలార్ లో గనక ఈయన కనబడితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే కేజిఎఫ్ లో సంజయ్ దత్ విలన్ గా చేసి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాడు అని చెప్పొచ్చు. ఇప్పుడు సలార్ లో కనిపించబోతున్నాడు అంటే ఈ మూవీ కూడా కేజీఎఫ్ అంత విజయాన్ని అందుకుంటుంది అని నమ్ముతున్నారు ఫాన్స్. మరి ఈ సినిమాలో సంజయ్ నటిస్తున్నాడా లేదా అన్న క్లారిటీ రావాలి అంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: