ఎన్నో ఏళ్లుగా నంబర్ వన్ కామెడీ షో గా కొనసాగుతున్న జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. ఇక ఇందులో కమెడియన్ గా పరిచయమైన చాలామంది హీరోలుగా డైరెక్టర్లు గా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలాగే చాలామంది బుల్లితెర పై పలు షోస్ చేసుకుంటున్నారు. వారితోపాటు మరికొందరు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్నారు. అయితే సాధారణంగా ఎవరికైనా సరే జబర్దస్త్ అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ముగ్గురు స్నేహితులు. సుడిగాలి సుదీర్ ఆటో రాంప్రసాద్ గెటప్ శ్రీను. మొదటి నుండి వీరు

 ముగ్గురు స్నేహితులుగా చలామణి అవుతున్నారు. ఆ తర్వాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి ఒక్కొక్కరు తమకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరు జబర్దస్త్ నుండి వెళ్లిపోయి బయట వెండితెరపై తమ టాలెంట్ చూపిస్తున్నారు. ఇప్పటికే గెటప్ శ్రీను కమెడియన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు రాజు యాదవ్ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇక సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా చేసి ఇప్పుడు మూడో సినిమాతో బిజీగా ఉన్నాడు.

 త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ ముగ్గురి స్నేహితుల్లో ఇద్దరు హీరోలుగా మారినప్పటికీ రాంప్రసాద్ మాత్రం డైరెక్టర్గా మారడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే బలగం సినిమాతో వేణు స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలోనే ధన రాజ్ సైతం డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఇప్పుడు రాంప్రసాద్ సైతం డైరెక్టర్గా పరిచయం అవ్వబోతున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు తన బెస్ట్ ఫ్రెండ్స్ ను హీరోలు కాబట్టి ఒక సినిమా తీయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వాళ్లకి కథ కూడా వినిపించాడని కథ వాళ్ళకి కూడా నచ్చింది అని ఇక వాళ్ల ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. మరి వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో వచ్చే ఆ సినిమా ఎలా ఉండబోతోంది ఏంటి అన్న విషయాలు తెలియాలి అంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: