సాధారణంగా ఎవరైనా హీరోయిన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం గడిచిపోయింది అంటే చాలు వారికి సీనియర్ హీరోయిన్ అనే ముద్ర వేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా హీరోయిన్లకు అవకాశాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఒకవేళ సినిమా అవకాశాలు వచ్చిన సీనియర్ హీరోల సరసన  నటించేందుకు మాత్రమే దర్శక నిర్మాతలు  ఆ హీరోయిన్లను సంప్రదించడం చేస్తూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో చాలామంది సీనియర్ హీరోయిన్లు వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు అని చెప్పాలి.


అయితే ఇలా ఎవరైనా హీరోయిన్ కి 30 ఏళ్ల వయసు దాటిపోయింది అంటే చాలు.. ఆ హీరోయిన్ ఎక్కడికి వెళ్లినా ఒకే ప్రశ్న ఎదురవుతుంది. మేడం మీ పెళ్లెప్పుడు అని ఎప్పుడు అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అందరికీ సమాధానం చెప్పలేక కొన్ని కొన్ని సార్లు హీరోయిన్లు తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ పెళ్లి విషయంలో ఇక ఫన్నీ కామెంట్లు చేయడం చేస్తూ ఉంటారు. అయితే ఇక సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడింది అంటే చాలు ఆ హీరోయిన్లకు ఆ వారితో పెళ్లి జరిగింది. వీరితో పెళ్లి జరగబోతుంది అంటూ ఎప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి.


 కాగా ఇటీవల సీనియర్ హీరోయిన్ అంజలి కి కూడా ఇదే ప్రశ్న ఎదురయింది. మేడం మీ పెళ్లెప్పుడు అని అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పింది. తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని.. అయితే ఇప్పుడు పెంపుడు కుక్కతో బయటికి వెళ్లే సమయం కూడా తనకు లేదు అంటూ చెప్పకు వచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్లలో మాట్లాడుతూ ఇప్పటికే నాకు నాలుగు ఐదు సార్లు పెళ్లి చేసేసారు. దీంతో ఇంట్లో వాళ్లకి నా వివాహ వార్తలపై నమ్మకం పోయింది. ఎవరైనా అబ్బాయిని చూపిస్తే తప్ప వాళ్ళు నమ్మరు. పెళ్లి అనేది లైఫ్ టైం సెటిల్మెంట్. ఇక ఇప్పుడూ నా 100% కాన్సన్ట్రేషన్ నటన పైనే ఉంది అంటూ అంజలి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: