మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గుంటూరు కారం సినిమా వల్ల జనాలలో నెగిటివ్ టాక్ పొందిన డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సోషల్ మీడియాలో నెటిజెన్స్ వల్ల ట్రోల్ కు గురి అవ్వాల్సి వచ్చింది. దానికి దీటుగా ఇప్పుడు తాను అదిరిపోయే స్క్రిప్ట్లతో మన ముందుకు రెడీ అవుతున్నారు.ఈ సినిమా మహేష్ బాబుతో తెరకెక్కించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . ఈ సినిమా మహేష్ బాబు అభిమానులను మెప్పించలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో త్రివిక్రమ్ ని ఓ రేంజ్ లో ఏకిపారేశారు జనాలు . మరి ముఖ్యంగా ఓ వర్గం ప్రేక్షకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఇక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పడం మేలు అని ఘాటుగా స్పందించారు .అయితే ఆ తర్వాత పెద్దగా బయట కనిపించిన త్రివిక్రమ్ సైలెంట్ గా తన పని తాను చేస్తున్నాడు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.

త్రివిక్రమ్ అద్దిరిపోయే కథతో ఏకంగా ముగ్గురు బడా హీరోలతో సినిమాకి బ్యాక్ టు బ్యాక్ కమిట్ అవుతున్నారట . ఆల్రెడీ అల్లు అర్జున్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడట మాటల మాంత్రికుడు . అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే రామ్ పోతినేనితో ఓ లవబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కించాలి అంటూ డిసైడ్ అయ్యారట.ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు..హీరో వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావ్ లాంటి ఒక మూవీ ని తెరకెక్కించబోతున్నారట . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఏమి సైలెంట్ గా లేడు అని ..తనని ట్రోల్ చేసిన వాళ్ళకి ఘాటుగా ఇచ్చి పడేసే మూమెంట్లోనే ఇలా బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి సినిమా స్టోరీస్ ను రాసుకుంటున్నాడు అని.. వన్స్ ఆయన సినిమాలు రిలీజ్ అయితే ఆ తర్వాత ఆయన రేంజ్ ఏంటో జనాలకి అర్థమవుతుంది అన్న రేంజ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస రావు కష్టపడుతున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: