తమిళ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు సూర్య ప్రకాశ్ మరణించడం జరిగింది. 1996లో మణికం అనే చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన మాయి అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఇక ఇందులో శరత్ కుమార్, మీనా జంటగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో సింహరాశి పేరుతో రీమేక్ చేయబడ్డారు. అటువంటి మంచి హిట్ సినిమాలతో ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సూర్య సడన్గా గుండెపోటుతో ఈరోజు తెల్లవారి జామున మరణించడం గమన్నార్హం.  

ఆయన మృతితో క్షేత్ర పరిశ్రమ ఆవేదన వ్యక్తం చేస్తుంది. సూర్య మరణం పై తమిళ్ స్టార్ హీరో శరత్ కుమార్ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. " నా కెరీర్ లో మాయి, దివన్ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన నా ప్రియ మిత్రుడు సూర్య ఈరోజు తెల్లవారుజామున భగవాన్ దగ్గరకు వెళ్లిపోయారనే వార్త బాధకు గురిచేసింది. నిన్న కూడా ఆయనతో మాట్లాడాను. ఇంతలో ఈ వార్త నన్ను చాలా బాధపెట్టింది. ఆయన హఠాత్తు మరణం చెందడంతో నా గుండె బరువెక్కింది. ఆయన మృతి తో బాధలో ఉన్న కుటుంబ సభ్యులకి స్నేహితులకి నా ప్రగాఢ సానుభూతి.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకుంటున్నాను " అంటూ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశారు శరత్ కుమార్. ప్రజెంట్ శరత్ కుమార్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ ని చూసిన పలువురు.. మిస్ యు సూర్య గారు. మీలాంటి  నటుడిని మేము చాలా మిస్ అవుతాం. మీరు లేని లోటు తమిళ్ ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తుంది. మిమ్మల్ని ఇంత త్వరగా తీసుకువెళ్లిపోయి ఆ దేవుడు పెద్ద తప్పు చేశాడు. మీ సినిమాలు లో మీ నటన ఓ అద్భుతం. ఇటువంటి గొప్ప నటుడుని కోల్పోవడం మా దురదృష్టం..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: