![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestylea8674d7e-433e-4086-9360-0ee5ce7726c7-415x250.jpg)
మేమిద్దరం ప్రేమించుకుంటున్నప్పుడు పెళ్లి గురించి ప్రస్తావన వస్తే.. పెద్దల అంగీకారంతోనే పెళ్లి అని ఇద్దరం ఫిక్స్ అయ్యాం. నేను బోల్డ్ గా చెప్పేస్తున్నా. పెళ్ళికి ముందే నేను రాజశేఖర్ గారితో ఒకే రూమ్ లో గడిపా. ఇద్దరం కలసి జీవించాం. మా ఇద్దరి క్లోజ్ రిలేషన్ వల్ల ఇండస్ట్రీలో మా గురించి పెద్ద హాట్ టాపిక్ అయింది. రాజశేఖర్ గారితో బోల్డ్ గా జీవించినప్పటికీ.. ఒక వేళ పెళ్లి కాకుంటే నా పరిస్థితి ఏంటి అని నేను భయపడలేదు.ఒకరోజు నేను మా అమ్మకి కూడా చెప్పా. అమ్మ నేను ఇంతే.. ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నా సరే.. ఆయనతో రిలేషన్ లో ఉంటా. ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎలా ఒప్పిస్తారు అనేది ఆయన ఇష్టం. కానీ నేను ఇంతే అని చెప్పేశా. ఇండస్ట్రీకి చెందిన ఒక అమ్మాయితో రాజశేఖర్ గారికి పెళ్లి ఫిక్స్ అయింది.ఒక రోజు ఆ అమ్మాయి నన్ను కలవాలని అడిగిందట. రాజశేఖర్ గారు ఆ అమ్మాయిని తీసుకువచ్చారు. ఇద్దరికీ రాజశేఖర్ అంటే బాగా ఇష్టం ఏర్పడింది. కానీ ఆ అమ్మాయి నా గురించి వాళ్ళ పేరెంట్స్ తో చర్చించిందట. వాళ్ళ పేరెంట్స్ రాజశేఖర్ గారికి కండిషన్ పెట్టారు. ఈ పెళ్లి జరగాలంటే నువ్వు జీవితని వదిలేయాలి అని అన్నారు. ఆమెతో మాట్లాడకూడదు అని చెప్పారట.కానీ రాజశేఖర్ నా వైపు నుంచి తప్పు ఉండదు. కానీ మాట్లాడకుండా ఉండడం మాత్రం కుదరదు అని చెప్పేశారు. దీనితో వాళ్ళు చర్చించుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర్ గారికి యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్ లో రాజశేఖర్ గారికి నేనే సేవలు చేశా. హాస్పిటల్ నుంచి మా ఇంటికి కూడా వెళ్ళలేదు. రాజశేఖర్ గారి ఇంటికే వెళ్ళా. ఆయన పూర్తిగా కోలుకునే వరకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. ఆ తర్వాత మేం డిసైడ్ అయి పెళ్లి చేసుకున్నట్లు జీవిత తెలిపారు.