ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది శ్రీ లీల. వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. అయితే పెళ్లి సందడి అనే చిన్న సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత మొదటి సినిమా మంచి విజయం సాధించడంతో శ్రీలీలకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. అయితే ఈ అమ్మడి అందం అభినయానికి మాత్రమే కాదు డాన్సింగ్ టాలెంట్ కి కూడా ఫిదా అయిన దర్శకులు వరుసగా అవకాశాలతో ఆమె తలుపు తట్టారు.


 అయితే శ్రీ లీల కెరియర్ను మలుపు తిప్పిన సినిమా ఏది అంటే మాత్రం రవితేజ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధమాకా మూవీ అని చెప్పాలి. రవితేజ సరసన నటించినప్పుడు శ్రీలీలను అందరూ తిట్టిపోశారు. అలాంటి సీనియర్ హీరోయిన్ సరసన నటించడం ఏంటి అని అన్నారు. కానీ ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. శ్రీ లీలకు మంచి గుర్తింపు రావడంతో విమర్శించిన నోళ్లే ప్రశంసలు కురిపించాయి. ఇక ఆ తర్వాత మహేష్ బాబు సహా మరి కొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది శ్రీ లీల.


 అయితే ఆమె కెరీర్ లో మలుపు తెప్పిన హీరోతో మరోసారి జోడి కట్టేందుకు శ్రీ లీల సిద్ధమైంది అనేది తెలుస్తోంది. ధమాకా కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుందట. రవితేజ, శ్రీ లీల మరోసారి కలిసిన నటించబోతున్నారట. ఇందుకు సంబంధించిన వార్త టాలీవుడ్ లో తెగచక్కర్లు కొడుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాణంలో రవితేజ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించపోతుందట. అయితే ప్రస్తుతం మూవీ టీం శ్రీలీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది అన్నది తెలుస్తుంది. భాను భోగవరకు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: