మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్ తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్.. తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఒకవైపు కొనిదెలా ప్రొడక్షన్స్ స్థాపించి నిర్మాతగా వాళ్ళు సినిమాలను నిర్మిస్తూనే.. ఇంకోవైపు ఇక వరుస ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.


 త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత వచ్చిన గ్లోబల్ స్టార్ క్రేజ్ పోగొట్టుకోకుండా ఇక కథల ఎంపికలో ఆచీ తూచి అడుగులు వేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ తో గేమ్ చేంజర్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది అని చెప్పాలి. ఇక అంతే కాకుండా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తో ఒక మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్. ఇక ఈ సినిమాపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయబోతున్నాడని టాక్.


 ఇలా వరుసగా ప్రాజెక్టులు లైన్లో ఉన్న సమయంలోనే మరో తమిళ డైరెక్టర్ ని లైన్ లో పెట్టేసాడట చరణ్. విలక్షణ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న వెట్రీ మారన్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. ఇటీవల ఈ దర్శకుడిని చరణ్ కలిసాడని.. ఇక ఆయన ఒక కథ వినిపించడంతో చరణ్ కథ నచ్చి ఓకే చేశాడని టాక్ చక్కర్లు కొడుతుంది. అయితే ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. వడ చెన్నై, అసురన్, విడుదలై లాంటి సినిమాలతో సూపర్ హిట్లు కొట్టాడు వెట్రిమోరన్. ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు చరణ్ తో ఎలాంటి సినిమా తీయబోతున్నాడు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: