టాలీవుడ్ ఇండస్ట్రీలో రెజీన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. ఫ్యాన్ బేస్ కూడా సంపాదించుకుంది. అందం,అభినయం ఉన్నా కూడా కొంతమంది హీరోయిన్స్ లక్ కలిసిరాదు. దీంతో కొంతమంది తట్టా బుట్టా సర్దేసుకుని ఫారెన్ వెళ్లిపోవడమో, లేదా మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవ్వడమో చేస్తారు.కానీ రెజీనా కసాండ్రా ఆ టైప్ కాదు. ఆ సరైన సక్సెస్ కోసం ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పాత్రకు ప్రాధాన్యం ఉన్న లు చేస్తూ తనదైన రోజు కోసం ఎదరుచూస్తూ ఉంది. ఒకప్పుడు ఈమెకు వరుస ఆఫర్లు ఉండేవి. ఓ మాదిరి హిట్లు కూడా అందుకుంది. సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్ వంటి హీరోల సరసన వరుస లు చేసింది. కానీ అగ్ర హీరోయిన్ అన్న పేరు మాత్రం రాలేదు. దీంతో మధ్యలో గ్లామర్ డోస్ కూడా పెంచింది. అయినా పరిస్థితులు మాత్రం మారలేదు. రెజినా తన శాకినీ డాకిని ప్రమోషన్ టైంలో చేసిన కాంట్రవర్సీ కామెంట్లు, మీడియాతో జరిగిన వార్‌లో ఓ రేంజ్‌లో ట్రెండ్ అయింది

మగాళ్లంతా మ్యాగీ టైపు.. కేవలం రెండు నిమిషాలే అంటూ రెజినా చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. కుర్రాళ్లు ఈ హీరోయిన్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. తాను మాత్రం మ్యాగీ టైపు రెండు నిమిషాలు కాదంటూ.. స్టేజ్‌పై అడివి శేష్ వేసిన పంచ్‌లు కూడా రెజీనాను కొన్నాళ్లు వార్తల్లో ఉంచాయి. ఇప్పుడు రెజినాకు తెలుగులో పెద్దగా అవాకాశాలు లేవు. తమిళ్‌లో మాత్రం రెండు, మూడు లు చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం మంచి యాక్టివ్ ఉంది రెజినా. హాట్ ఫోటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటోంది. ఇక తాజాగా రెజినా విత్ అవుట్ మేకప్ లుక్ మస్త వైరల్ అవుతోంది. బాస్కెట్ బాల్ ఆడుతూ.. గేమ్ కోర్టు నుంచి ఓ వీడియో తీసి తన ఇన్ స్టా స్టోరీలో పెట్టుకుంది. ఇక రెజినా ఇలా విత్ అవుట్ మేకప్‌లో కనిపించే సరికి ఫ్యాన్స్ స్టన్ అవుతున్నారు. మామూలుగా హీరోయిన్లు మేకప్ లేకుండా కనిపించేందుకు అస్సలు ఇష్టపడరు. కానీ రెజినా మాత్రం అవేం పట్టించుకోకుండా.. తన నచ్చినట్లు లైఫ్ లీడ్ చేస్తోంది. అయినా హీరోయిన్స్ అయితే మాత్రం పొద్దాక ఆ మేకప్‌లో ఉండాలా ఏంటి..? వాళ్లకంటూ స్పేస్ ఉండదా చెప్పండి…అంటూ కొంత మంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: