తెలుగులోనే అతి పెద్దగా పెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్బాస్ ఇప్పటికే ఏడు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే 8వ సీజన్ రన్ కాబోతుంది . కాగా ఈ సీజన్ కూడా నాగార్జున నే హోస్ట్ చేయబోతున్నట్లు ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.ఇలాంటి క్రమంలోనే బిగ్ బాస్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసిన కొన్ని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో లీక్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్న కంటెస్టెంట్ల లిస్టులలో కొంతమంది పేర్లు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి .ప్రతీ బిగ్ బాస్ సీజన్లో ఒక యూట్యూబర్ను కంటెస్టెంట్గా తీసుకురావడం సహజం. అలాగే బిగ్ బాస్ 8లో తన యూట్యూబ్ కంటెంట్తో నవ్వించే బమ్చిక్ బబ్లూ కంటెస్టెంట్గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమాలతో ఒక రేంజ్ను సక్సెస్ చూసి చాలాకాలమే అయ్యింది. అందుకే బిగ్ బాస్లో కంటెస్టెంట్గా రావడం వల్ల తన కెరీర్కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్, ‘విరూపాక్ష’ ఫేమ్ సోనియా సింగ్.. బిగ్ బాస్లో కంటెస్టెంట్గా వస్తే షోకు కాస్త గ్లామర్ కూడా యాడ్ అవుతుంది. ‘విరూపాక్ష’లో నటించిన తర్వాత తన గురించి ఎక్కువమంది ప్రేక్షకులకు తెలిసింది.

ఇప్పటికే హేమ.. ఒక బిగ్ బాస్ తెలుగు సీజన్లో కంటెస్టెంట్గా వచ్చింది. కానీ వచ్చిన మొదటి వారమే ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది. ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ చుట్టూ పలు కాంట్రవర్సీలు కూడా తిరుగుతూ ఉండడంతో హేమను కంటెస్టెంట్గా తీసుకుంటే సీజన్కు కూడా హైప్ వస్తుంది.మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షోకు అప్పుడప్పుడు రియల్ లైఫ్ కపుల్స్ కూడా కంటెస్టెంట్స్గా వస్తుంటారు. కానీ ఈసారి విడాకులు అయిపోయిన మాజీ భార్యభర్తలు రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నేత్ర ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, వంశీకృష్ణ ఒక మోటివేషనల్ స్పీకర్. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.జబర్దస్త్ నుండి బిగ్ బాస్కు.. ప్రతీ సీజన్ ఎవరో ఒక షిఫ్ట్ అవుతూనే ఉంటారు. అలా ఈసారి నరేశ్, రియాజ్, కిరాక్ ఆర్పీలలో ఎవరో ఒకరు కంటెస్టెంట్గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.తన సోషల్ మీడియా పోస్టులు, షోలు.. ఇలా దేంట్లో చూసినా రీతూ చాలా బోల్డ్గా కనిపిస్తుంది, మాట్లాడుతుంది. బిగ్ బాస్ ఎక్కువగా బోల్డ్ కంటెస్టెంట్స్కు ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి సీజన్ 8లో అలాంటి బోల్డ్ కంటెస్టెంట్ రీతూ చౌదరీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సురేఖ వాణి కూతురు సుప్రిత కూడా బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్గా అడుగుపెట్టనుందని టాక్ వినిపిస్తోంది. సురేఖ వాణి కూడా పలుమార్లు బిగ్ బాస్లో కంటెస్టెంట్గా వస్తుందనే వార్తలు వచ్చినా అది జరగలేదు. అందుకే ఈసారి తన కూతురు సుప్రిత పేరు వెలుగులోకి వచ్చింది.ఒక స్ట్రీట్ ఫుడ్ ఓనర్ దగ్గర నుండి సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయారు కుమారీ ఆంటీ. సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యారు కాబట్టి ముందుగా తనను కంటెస్టెంట్గా పరిచయం చేసి తర్వాత కొన్ని వారాలకే ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువ.బర్రెలక్క.. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు.. పొలిటీషియన్ కూడా. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో బర్రెలక్క గురించి చాలామంది ప్రజలకు తెలిసింది.ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరికి చెందిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో కుషిత కల్లపు కూడా ఒకరు. తను సోషల్ మీడియాలో షేర్ చేసే హాట్ ఫోటోషూట్స్కు వేలల్లో లైకులు వచ్చిపడుతుంటాయి. ఇక ఇలాంటి అమ్మాయి బిగ్ బాస్ హౌజ్లోకి అడుగుపెడితే గ్లామర్ డోస్ మరింత పెరిగే అవకాశం ఉంది.బుల్లెట్ భాస్కర్.. ఇంకా జబర్దస్త్లోనే కమెడియన్గా కంటిన్యూ అవుతుండగా.. చమ్మక్ చంద్ర మాత్రం చాలాకాలం క్రితమే ఈ షోను వదిలేసి వెళ్లిపోయాడు. ఇప్పటికే బుల్లెట్ భాస్కర్కు పలుమార్లు బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చినా వెళ్లలేదు. సీజన్ 8లో మాత్రం ఈ ఇద్దరిలో ఒకరు కంటెస్టెంట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి.మన దేశంలో పరువు హత్యలు కొత్తేమీ కాదు. కానీ అలాంటి పరువు హత్యల గురించి ఒక్కసారిగా ప్రతీ ఒక్కరికి తెలిసేలా చేసింది ప్రణయ్ మర్డర్ కేసు. తన భార్య అయిన అమృత బిగ్ బాస్లో కంటెస్టెంట్గా వస్తే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: