తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఉంటూ హైలైట్ అయ్యారు.అలాంటి వారిలో గాయత్రి గుప్తా ఒకరు. సినిమాల్లో పద్దతిగా కనిపించినా.. ఈ అమ్మడు బయట మాత్రం బోల్డుగా ఉంటూ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ గురించి మొట్టమొదట లేవనెత్తి సెన్సేషన్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా.. మరోసారి కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలు ఆమె ఏం చెప్పిందో మీరే చూడండి.గాయత్రి గుప్తా మొదట టీవీ ప్రోగ్రామ్‌ల ద్వారా పరిచయం అయింది. మొదట ఆమె యాంకర్‌గా చేసిన బాగా పాపులర్ అయింది. అలాగే, పలు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ముఖ్యంగా గాయత్రి 'ఫిదా', 'ఐస్‌క్రీమ్ 2', 'కొబ్బరిమట్ట', 'మిఠాయి' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. అలాగే, 'పెళ్లికి ముందు', 'సీత ఆన్ ద రోడ్' అనే షార్ట్ ఫిల్మ్‌లలోనూ నటించింది.తెలుగు నటి గాయత్రి గుప్తా ఈ మధ్య కాలంలో పెద్దగా అవకాశాలను అందుకోవడం లేదు. కానీ, దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఇలా ఈ మధ్య కాలంలో 'అన్‌స్టాపబుల్', 'ప్లాట్', 'డబుల్ ఇంజిన్' వంటి సినిమాల్లో నటించింది. అలాగే, గత ఏడాది వచ్చిన 'దయా' వెబ్ సిరీస్‌లో అద్భుతమైన పాత్రను చేసి ఆకట్టుకుంది.టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ అనే అంశం ఎంతటి సంచలనం అయిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిని శ్రీరెడ్డి తెరపైకి తీసుకువచ్చిందని చాలా మంది అనుకుంటారు. కానీ, ఆమె కంటే ముందే కాస్టింగ్ కౌచ్‌పై గాయత్రి గుప్తా పోరాటాన్ని మొదలు పెట్టింది. అవకాశాలు ఇప్పిస్తామని తనను చాలా మంది మోసం చేశారని చెప్పి అప్పట్లో పెద్ద రాద్దాంతమే చేసేసింది.కాస్టింగ్ కౌచ్ గురించి పోరాటాన్ని చేసిన గాయత్రి గుప్తా.. ఆ తర్వాత బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలని కూడా ప్రయత్నాలు చేసింది. మరీ ముఖ్యంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరకు వెళ్లి మరీ బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలని పోరాటం చేసింది. దీంతో గాయత్రి దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఆ సమయంలో పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.గాయత్రి గుప్తా తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె కాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడుతూ.. 'గతంలో నేను చేసిన పోరాటానికి అంతగా సహకారం అందలేదు. తర్వాత మరికొందరు నాలా పోరాడడం వల్లే ఇండస్ట్రీ స్పందించింది. ఇందుకోసం ఓ కమిటీని కూడా వేశారు. ఇప్పుడు చాలా మంది బాధితులకు అది ఒక ఫ్లాట్‌ఫాం అయింది' అంటూ చెప్పుకొచ్చింది.ఇదే ఇంటర్వ్యూలో గాయత్రి గుప్తా కంటిన్యూ చేస్తూ.. 'ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. అయితే, చాలా మంది హీరోయిన్లు ఇష్టంతోనే శృంగారం వంటివి చేస్తున్నారు. కొందరు మాత్రం అవసరాల కోసం చేస్తున్నారు. వీళ్లలో అమాయకపు అమ్మాయిలే ఎక్కువగా బలి అవుతున్నారు' అని వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: