స్పై సినిమాలో స్టైలిష్ యాక్షన్ తో ఆకట్టుకున్న హీరోయిన్ ఐశ్వర్య మీనన్…అందుకు పూర్తి కాంట్రాస్ట్ క్యారెక్టర్ లో "భజే వాయు వేగం"లో కనిపించనుంది.ఐశ్వర్య మీనన్‌ స్పై చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ డిజప్పాయింట్‌ చేసింది. ఇప్పుడు భజే వాయు వేగం చిత్రంలో నటిస్తుంది. తాజాగా స్పై ఫెయిల్యూర్‌పై ఆమె రియాక్ట్ అయ్యింది.స్పై చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్‌. ఇందులో గ్లామర్‌గానే కాదు యాక్షన్‌తోనూ మెప్పించింది. ట్విస్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసింది. కానీ సినిమా తేడా కొట్టింది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫెయిల్యూర్‌పై స్పందించింది ఐశ్వర్య. సినిమా బాగుందనే చేశామని, కానీ ఫలితం మన చేతుల్లో ఉండదని చెప్పింది. `ప్రతి సినిమాను ఇష్టపడే చేస్తాం. కానీ ఫలితం మన చేతుల్లో ఉండదు.నా సినిమాలన్నీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటా. కానీ ఆ ఫలితం ఇచ్చేది ప్రేక్షకులు. వాళ్లకు మూవీ నచ్చాలి. వాళ్లు ఆదరించాలి.అప్పుడే విజయం దక్కుతుంది. స్పై సినిమా విషయంలో నేను అనుకునేది ఇదే. ఆ సినిమా కోసం టీమ్ అంతా శ్రమించారు. కానీ రిజల్ట్ అనుకున్నట్లు రాలేదు` అని తెలిపింది ఐశ్వర్య మీనన్.ఐశ్వర్య మీనన్‌ తెలుగులో మరో సినిమాతో రాబోతుంది. కార్తికేయతో కలిసి భజే వాయు వేగం చిత్రంలో నటించింది. ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ నెల 31న సినిమా రిలీజ్‌ కాబోతున్న నేపథ్యంలో సోమవారం ఐశ్వర్య మీనన్‌ మీడియాతో ముచ్చటించింది.

ఇందులో ఆమె మాట్లాడుతూ `భజే వాయు వేగం సినిమాలో ఇందు అనే క్యారెక్టర్ చేశాను. ఆమె బ్యూటీషియన్. బ్యూటీషియన్ అంటే సహజంగానే అందంగా ఉంటుంది. ఈ సినిమాలో హీరో పేరు వెంకట్.ఆయన పర్సెప్షన్ లోనే సినిమా అంతా వెళ్తుంది. కథలో నేను కీలకమైన పాత్రగా ఉంటాను. ఇది కమర్షియల్ సినిమా అయినా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అలా వచ్చి ఇలా వెళ్లినట్లు నా క్యారెక్టర్ ఉండదు. వెంకట్ కోసం ఈ అమ్మాయి ఏదైనా చేస్తుంది.అంతగా అతన్ని ఇష్టపడుతుంది. భజే వాయు వేగం ఒక రా కంటెంట్ మూవీ. యాక్షన్, ఎమోషన్ ఆకట్టుకుంటాయి. నాకు ఇలాంటి సబ్జెక్ట్స్ చేయడం ఇష్టం పైగా యూవీ లాంటి పెద్ద బ్యానర్ నిర్మించింది.సో ఆఫర్ వచ్చిన వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నా. ఈ సినిమాలో ట్రెడిషనల్ క్యారెక్టర్ లో కనిపిస్తా. సినిమా చీరకట్టు లేదా ట్రెడిషనల్ దుస్తులు వేసుకుంటా. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం ఇష్టం ఎందుకంటే రియల్ లైఫ్ లో కూడా నాకు ట్రెడిషనల్ దుస్తులు ధరించేందుకు ఇష్టపడుతుంటా.

మరింత సమాచారం తెలుసుకోండి: