బాహుబలి సినిమా తరువాత బాలీవుడ్ స్టార్స్ ని కూడా బీట్ చేసి ప్రభాస్ తన మార్కెట్ ని పెంచుకుంటూ పోయారు.యావరేజ్ గా చూసుకున్న దాదాపు 500+ కోట్ల వరకు ప్రస్తుతం ప్రభాస్ కి మార్కెట్ వేల్యూ ఉందనే మాట వినిపిస్తోంది. ఆయన నుంచి రాబోతున్న కల్కి 2898 ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా పాన్ వరల్డ్ రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఓవర్సీస్ పరంగా చూసుకున్న కూడా ప్రభాస్ కి తిరుగులేదని చెప్పొచ్చు. అక్కడ కలెక్షన్స్, అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ప్రభాస్ టాప్ లో ఉన్నారు. ఏ హీరో సినిమాకి జరగని స్థాయిలో ప్రభాస్ సినిమాలకి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతూ ఉంటాయి. సినిమా సినిమాకి కూడా ప్రభాస్ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా తన ఇమేజ్ పెంచుకుంటూ పోతున్నాడు.ఇక నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ పరంగా చూసుకుంటే గతంలో ఫాస్టెస్ట్ 500కె డాలర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిన సినిమాగా సలార్ సినిమా నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డ్ ని కల్కి 2898ఏడీ సినిమా బ్రేక్ చేసింది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్స్ పరంగా ట్రెండ్ సృష్టిస్తోంది. 


అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసిన చిత్రంగా కల్కి మూవీ నిలబడింది. ఇప్పటి దాకా ఏకంగా 2 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే కల్కి చిత్రం వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రిలీజ్ అయ్యే లోపు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 3-4 మిలియన్ డాలర్స్ ని కల్కి 2898ఏడీ మూవీ ఈజీగా కలెక్ట్ చేయొచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అసలు ఇండియన్ బాక్సాఫీస్ లో ఏ ఒక్క హీరో సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రావడం లేదు. షారుఖ్ ఖాన్ గత ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. బ్యాక్ టూ బ్యాక్ 1000 కోట్ల కలెక్షన్స్ ని శారుఖ్ ఖాన్ అందుకున్నారు.అయితే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మాత్రం ఆ సినిమాలు కూడా డార్లింగ్ మార్కెట్ ని బ్రేక్ చేయలేకపోయాయి. ఇక ఇదిలా ఉంటే కల్కి 2898ఏడీ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ఈ పాన్ వరల్డ్ మూవీని నిర్మించింది. ఏకంగా 22 భాషలలో కల్కి మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: