ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఒకే విషయం గురించి చర్చించుకుంటున్నారు. అదేంటో కాదు ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి అనే మూవీ గురించి. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. తెలుగుతోపాటు వివిధ భాషలు ఈ మూవీ విడుదల కాబోతుంది.


 ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా.. ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మా దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. అదే సమయంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కీలక పాత్రలో నటించగా కమల్ హాసన్ కూడా మరొక కీ రోల్ పోషించబోతున్నారు అని చెప్పాలి. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అభిమానులు అందరిలో ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఇండియన్ సినిమా ప్రేక్షకులు మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు.


 అయితే ఇక ఈ చిత్రబృందం ఇటీవలే ఒక ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో ప్రభాస్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్, అమితా బచ్చన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించడం తన డ్రీమ్ అని హీరో ప్రభాస్ అన్నారు. అమితాబచ్చన్ ను తొలిసారి చూడగానే పాదాలు తాకి ఆశీస్సులు తీసుకునేందుకు ప్రయత్నిస్తే ఆయన వద్దని వారించారు. ఒకవేళ ఇది ఆపకపోతే తిరిగి ఆయన పాదాలకు నమస్కరిస్తారని చెప్పడంతో ఊరుకున్నాను అంటూ ప్రభాస్ తెలిపారు. ఇక ఇంద్రుడు చంద్రుడు సినిమాలో కమల్ నటనకు ఫిదా అయ్యానని చెప్పుకొచ్చారు. దీపిక ఒక సూపర్ స్టార్ అని.. ఆమెతో నటించడం చాలా ఆనందంగా ఉంది అంటూ ప్రభాస్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: