టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది.  భీష్మ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న రావడంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జానర్ లో వస్తున్న ఈ సినిమా కి సంబంధించిన అప్డేట్స్ మాత్రం బయటికి వదలడం లేదు. అయితే ఇదివరకు ఇటువంటి జానర్ లో సినిమాలు చేసిన నితిన్ ఆ సినిమాలతో మంచి విజయాన్ని

 అందుకున్నాడు. మరి అలాంటి తరహాలోని వస్తున్న ఈ సినిమాతో నితిన్ ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇకపోతే ఇందులో నితిన్ కి జోడి గా శ్రీ లీలా నటిస్తోంది. అంతేకాదు ఇందులో వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది అని శ్రీలీల ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఇందులో వండర్ఫుల్ గా ఉంటుంది అని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాని మొదట డిసెంబర్లో విడుదల చేయాలి అని ప్లాన్ చేశారో మేకర్స్. డిసెంబర్లో అయితే పెద్ద సినిమాలు ఏవి ఉండవు కాబట్టి ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అన్న ప్లాన్ చేసే ముందు డిసెంబర్లో విడుదల చేయాలి అని భావించారు మేకర్స్. కానీ తాజాగా ఇప్పుడు ఆ ప్లాన్ రివర్స్ అయ్యింది. ఎందుకంటే..

డిసెంబర్ లో పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా కూడా మైత్రీ మూవీ మేకర్స్ లోనే వస్తోంది. అలాగే గేమ్ చేంజర్ కూడా డిసెంబర్ లో వచ్చే అవకాశాలు ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాబిన్ హుడ్ చిత్రాన్ని ముందుగా రిలీజ్ చేసే అవకాశాలని నిర్మాతలు పరిశీలిస్తున్నారంట. కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అందుబాటులో ఉండటంతో ఆ టైంలో పాజిబుల్ అవుతుందేమో చూస్తున్నారంట.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. పెండింగ్ షూటింగ్ కూడా తొందరగా పూర్తి చేసి సరైన డేట్ చూసుకొని రిలీజ్ ఎనౌన్స్ చేయాలని భావిస్తున్నారంట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: