మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కాజల్ అగర్వాల్ కెరియర్ ప్రారంభంలో ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకుంది. ఈమె కెరియర్ ప్రారంభించిన కొత్తలోనే అనేక విజయాలను అందుకోవడంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. స్టార్ హీరోయిన్గా కెరీర్ను కొనసాగిస్తున్న సమయంలో ఈ బ్యూటీ ఎన్నో కమర్షియల్ సినిమాలలో తన అందాలను ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ మరికొన్ని సినిమాలలో తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అలా నటనతో, అందాలతో రెండింటితో ప్రేక్షకులను ఆకట్టుకొని చాలా సంవత్సరాల పాటు కెరియర్ను అద్భుతమైన జోష్లో ముందుకు సాగించిన ఈనటి కొంతకాలం క్రితమే గౌతమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ ఓ పండంటి బిడ్డకు జన్మని కూడా ఇచ్చింది. పెళ్లి కావడంతో ఈమె గతంలో మాదిరి సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేయడానికి ఇష్టపడడం లేదు అని తెలుస్తుంది. దానితో ఈమె ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో, అలాగే తన పాత్రకు ప్రాధాన్యత ఉండి, ఎలాంటి గ్లామర్ షో కి విలు లేని పాత్రలలో నటించాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా కాజల్ కొంతకాలం క్రితమే భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇందులో ఈమె హీరోయిన్గా నటించిన ఎలాంటి పాటలు లేవు, అలాగే గ్లామర్ షో కూడా లేదు. తాజాగా ఈ బ్యూటీ సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించింది. ఈ మూవీలో కూడా ఈమె ఎలాంటి గ్లామర్ షో చేయకుండా కేవలం తన నటన పైనే ఆధారపడింది. కానీ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోలేదు. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించినట్లు అయితే ఈమెకు మరిన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఛాన్స్ దొరికే అవకాశం చాలా వరకు ఉండేది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ సాధించకపోవడంతో ఈమె ఆలోచనలో పడిపోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: