ఎప్పుడు వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులు అందరిని సర్ప్రైజ్ చేసే నాగ్ అశ్విన్ ఇక ఇప్పుడు తన కెరీయర్ లోనే ఒక సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. అదే 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకేక్కిన కల్కి మూవీ. విష్ణుమూర్తి దశావతారాల్లో చివరిదైన కల్కి అవతారం కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. మైథాలజీకి ఫ్యూచరిస్టిక్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ లో హీరోగా ప్రభాస్ నటించిన ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 అయితే ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ కూడా టచ్ చేయని ఒక స్పెషల్ కాన్సెప్ట్ తో నాగ్ అశ్విన్ ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఇప్పటికే చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన రెండు ట్రైలర్లు అభిమానుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి. ఇండియన్స్ సినిమా ఇండస్ట్రీలోనే ఈ సినిమా ఒక స్పెషల్ పీస్ గా మారే అవకాశం ఉందని ఇక ఫ్యాన్స్ అందరూ కూడా భారీగానే అంచనాలు పెట్టుకుంటున్నారు. ప్రభాస్ కెరియర్ లో ఏకంగా బాహుబలికి మించి ఈ సినిమా హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు.


 అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేస్తున్న ఒక పని మాత్రం చివరికి కొంప ముంచేలాగే ఉంది అని టాలీవుడ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారట. ఎందుకంటే ప్రమోషన్స్లో రాజమౌళి లెవెల్ ని తాగలేకపోతున్నాడు నాగ్ అశ్విన్. ఏ సినిమా అయినా హిట్ కావాలంటే ప్రమోషన్స్ గట్టిగా నిర్వహించడం ఎంతో ఇంపార్టెంట్. రాజమౌళి ప్రమోషన్స్ విషయంలో ఎంత పకడ్బందీ ప్లాన్ తో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నాగ్ అశ్విన్ మాత్రం ఇప్పటివరకు తెలుగులో అసలు ప్రమోషన్స్ నిర్వహించడం లేదు. కంటెంట్ ఉన్న సినిమాకు ప్రమోషన్స్ ఎందుకు అనుకుంటున్నారో.. లేదంటే ఇంకేం ప్లాన్ చేసాడో తెలియదు కానీ.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం నాగ్ అశ్విన్ తీరుపై మండిపడుతున్నారు. ఇంత ఖర్చు పెట్టి ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోతే ఇక చివరికి ఎక్కడో తేడా కొట్టే అవకాశం ఉంది అంటూ అభిప్రాయపడుతున్నారు ఫ్యాన్స్. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: