అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా కోసం దేశావ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే విడుదలకు ముందే అభిమానులలో ఉత్సాహం స్పష్టంగా ఉంది, కానీ ఎన్నో వాయిదాలు అల్లు అర్జున్ అభిమానులను నిరాశపరిచాయి.రీసెంట్ గా ఇండిపెండెన్స్ డే రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా మళ్లీ వెనక్కి తగ్గింది. పుష్ప ఫస్ట్ పార్ట్ 2021 చివరిలో విడుదలైంది, భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేసిన చిత్రనిర్మాతలు వెంటనే సీక్వెల్‌ను రూపొందించే పనిలో ఉన్నారు. పుష్ప 2 స్క్రిప్ట్, ఇతర ప్రీ-ప్రొడక్షన్ పనులు ముందుగానే ప్రారంభమయ్యాయి. అయితే అసలు షూటింగ్ మాత్రం అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత కూడా వివిధ కారణాల వల్ల చాలా ఆలస్యం అయ్యింది.


మొదట్లో, అల్లు అర్జున్ అనారోగ్యం, కొన్ని భాగాలను రీషూట్ చేయాలని దర్శకుడు సుకుమార్ తీసుకున్న నిర్ణయం ఇందుకు ఆలస్యానికి కారణాలుగా చెప్పారు. అయితే, ఇటీవల ఈ ఆలస్యానికి కారణం మలయాళం నటుడు ఫహద్ ఫాసిల్ అని తెలిసింది.  ఫహద్ జనవరి, ఫిబ్రవరిలో 'పుష్ప 2' సినిమా కోసం తన సమయం కేటాయించాడు. అయితే, సుకుమార్ తన షూటింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేయడం వల్ల ఈ తేదీలలో షూట్ అవ్వలేదు. ఇక ఇది ఫహద్‌ను కలవరపెట్టింది. ఇతర ప్రాజెక్ట్‌లతో అతని బిజీ షెడ్యూల్ కారణంగా, 'పుష్ప 2' కోసం కొత్త తేదీలను ఇవ్వడం అతనికి పెద్ద సవాలుగా మారింది.అయితే ఫహద్ ఈమధ్య ఈ చిత్రానికి కొత్త తేదీలను కేటాయించగలిగాడు. అయితే ఈ సినిమా విడుదల డిసెంబర్ 6కి వాయిదా పడింది. ఈ ఆలస్యం అవ్వడం వల్ల నిర్మాతలకు దాదాపు రూ. 50 కోట్ల దాకా నష్టం వచ్చిందని సమాచారం తెలుస్తుంది.పుష్ప 2 సినిమా కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి పలు ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, అంచనాలు మాత్రం ఇంకా భారీగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: