బయట సమాజంలో కూడా వేధింపులు అనేవి ఉన్నాయి . ప్రతి రంగంలో మహిళపై జరిగే అన్యాయాలు జరుగుతూనే ఉంటున్నాయి . కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి . ఎందుకంటే ఇండస్ట్రీలో ఇటువంటివి చేయడానికి అవకాశాలు ఎక్కువ . దీన్ని మనం దూరం చేయలేం . అమ్మాయిలు అందంగా, ఎన్నో ఆశలతో, ఇండస్ట్రీలో ఏదో సాధించాలని వస్తే కచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకునే మగవాళ్లు ఉన్నారు . ఎవ్వరు దాని గురించి బలవంత పెట్టరు . కానీ ఆ ఛాయిస్ అయితే ఉంది .
అవకాశాల కోసం నువ్వు ఏం చేయగలుగుతావు అనే చూస్తారు " అంటూ ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది ఈ బ్యూటీ . ఇక మీకు ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తారు అని యాంకర్ ప్రశ్నించగా.." నేను అలా చేయను . నా దారిలో నేను వెళ్తాను . అంతే ఎవరు బలవంత పెట్టరు . అలా కాకుండా నాకు తొందరగా పెద్ద స్టార్ కావాలని ఉంది ఏం చెప్పినా చేస్తాను అనుకునే వాళ్ళకి అదే షార్ట్ కట్ " అంటూ తెలిపింది. ఇక తన సొంత టాలెంట్ తోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవాలని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి