అక్కినేని ఫ్యామిలీ వారసుడు నాగ చైతన్య కేవలం టాలెంటెడ్ హీరో మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి అని, గుడ్ హ్యూమన్ బీయింగ్ అని ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. తన తోటి నటీనటులతో, దర్శకులతో ఎంతో వినయంగా నడుచుకునే చైతన్య తన ఫ్యాన్స్ పట్ల కూడా ఎంతో ప్రేమను చూపిస్తారు. తన వ్యక్తిగత సిబ్బందిని కూడా సొంత కుటుంబ సభ్యుల లాగానే చూసుకుంటారు. నాగ చైతన్య ఎంత మంచివాడో చెప్పడానికి తాజాగా జరిగిన ఓ విషయాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.కొంకిపూడి వెంకటేష్ అనే వ్యక్తి నాగ చైతన్యకు పర్సనల్ అసిస్టెంట్ గా పని చేస్తూ ఉంటారు. శుక్రవారం నాడు ఆయన పెళ్లి జరిగింది. రాజమండ్రిలో జరిగిన ఈ వివాహ వేడుకకు నాగ చైతన్య హాజరయ్యారు. చైతూ నూతన వధూవరులను ఆశీర్వదించి, వారిని ఆనందింపజేశారు. అక్కడే చాలాసేపు వారితో సమయం గడిపి, వారి కుటుంబ సభ్యులను సంతోష పరిచారు. అక్కడికి విచ్చేసిన అభిమానులతో ఓపికగా ఫోటోలు దిగి వారి హృదయాలను కూడా నాగ చైతన్య గెలుచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నాగ చైతన్య ఆగస్టు 8 వ తేదీన హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. 


ఆ మరుసటి రోజే తన అసిస్టెంట్ మ్యారేజ్ కోసం హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి రాజమండ్రి వెళ్లారు. తన ఇతర పనులన్నీ కూడా పక్కన పెట్టి మరీ ఈ పెళ్ళికి అటెండ్ అయ్యారంటేనే చైతూ తన వ్యక్తిగత సిబ్బందికి, తన దగ్గర పనిచేసే వారికి ఎంత విలువ ఇస్తారో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది అక్కినేని నాగ చైతన్య సింప్లిసిటీని, డౌన్ టూ ఎర్త్ స్వభావాన్ని మరోసారి అందరికీ తెలియజేస్తోంది. ఇది చూసి నిజంగా నాగ చైతన్య ఒక జెమ్ అని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు తన దగ్గర పని చేసేవారికి కూడా ఆర్ధికంగా అండగా నిలుస్తారు నాగ చైతన్య. వాళ్ళ అవసరాలు తీరుస్తాడు నాగ చైతన్య.నిజానికి నాగచైతన్య చాలా సార్లు తన మంచి మనసును చాటుకున్నారు. చాలా సేవా కార్యక్రమాలు చేసి, ఎంతోమందికి ఆయనకి హెల్ప్ చేసారు. కాని వాటిని బయటకు చెప్పుకోడానికి అతను పెద్దగా ఇష్టపడరు. గతంలో ఓ చైల్డ్‌కేర్‌ సెంటర్‌ కు వెళ్లి అక్కడ క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారుల ముఖాల్లో చిరు నవ్వులు చిందించారు నాగ చైతన్య. సరదాగా వారితో ఆటలు ఆడి, బహుమతులు అందజేసి వారిలో మనో ధైర్యాన్ని నింపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: