2018 ఆగస్టు 15న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన గీత గోవిందం మూవీ ఐదు కోట్ల బడ్జెట్ తో తెరికెక్కితే దాదాపు 132 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఐదు కోట్ల బడ్జెట్ తో 132 కోట్ల వసూళ్ళు అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు అయితే అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీనీ డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించారు. రష్మిక మందన్నా,విజయ్ దేవరకొండలు హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో మొదట హీరో హీరోయిన్ ఛాన్స్ మరో ఇద్దరు స్టార్స్ మిస్ చేసుకున్నారట.మరి ఆ ఇద్దరు ఎవరు..ఎందుకు మిస్ చేసుకున్నారు అనేది చూస్తే.. గీత గోవిందం మూవీలో విజయ్ దేవరకొండ పాత్ర కోసం ముందుగా డైరెక్టర్ పరుశురాం అల్లు అర్జున్ ని అనుకున్నారట.. 

కానీ ఈ హీరో సినిమాలో చేయడానికి ఆసక్తి చూపించలేదట.అలాగే ఈ సినిమాలో రష్మిక మందన్నా కంటే ముందు హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని అనుకున్నారట. ఎందుకంటే పరుశురాం దర్శకత్వంలో వచ్చిన శ్రీరస్తు శుభమస్తు సినిమాలో లావణ్య  హీరోయిన్ గా చేసింది. అలా తన నెక్స్ట్ సినిమాలో కూడా పరుశురాం లావణ్య త్రిపాటికి అవకాశం ఇచ్చారట.గీతగోవిందం స్టోరీ మొత్తం విని విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ ఉంది అనే కారణంతో ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట.  లావణ్య త్రిపాటి లిప్ లాక్ కి భయపడి రిజెక్ట్ చేయడంతో అధి కాస్త రష్మిక మందన్నా చేతిలో వచ్చి పడింది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ ల యాక్టింగ్ కి జనాలు ఫిదా అయిపోయారు.

అప్పటినుండి వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా నడుస్తున్నట్టు టాక్. అలా అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకు గీత గోవిందం సినిమా మంచి హిట్ ఇచ్చింది.ఇక ఇప్పటివరకు గీతగోవిందం లాంటి సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లో రాలేదని చెప్పుకోవచ్చు. అలాగే రష్మిక మందన్నా క్రేజ్ కూడా ఈ సినిమాతో అమాంతం పెరిగిపోయింది.ఈ సినిమాలో నటించాక ఎన్నో ఆఫర్స్ రష్మిక దగ్గరికి వచ్చాయి.అలా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గీత గోవిందం మూవీలని అల్లు అర్జున్ లావణ్య త్రిపాఠిలు అవకాశం మిస్ చేసుకున్నారు. అయితే ఆగస్టు 15తో ఈ సినిమా విడుదలై ఆరేళ్లు పూర్తయింది

మరింత సమాచారం తెలుసుకోండి: