•అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం..
•సీరియల్స్ ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకున్న బ్యూటీ..
సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొంతమంది సక్సెస్ కోసం ఆరాటపడితే, మరికొంతమంది అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ అందుకుంటారు. అయితే అలా అందుకున్న వారికి సుదీర్ఘంగా అవకాశాలు వస్తాయా అంటే చెప్పలేని పరిస్థితి. కొంతమందికి అదృష్టం ఉంటే అవకాశాలు తలుపు తాడతాయి. అదృష్టం లేకపోతే ఎన్ని సినిమాలు సక్సెస్ అయినా అవకాశాలు మాత్రం రావనే చెప్పాలి. తద్వారా అవకాశాలు రాకపోయేసరికి ఇండస్ట్రీకి దూరమైతే, మరికొంతమంది ఇతర కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. అలాంటి వారిలో దిల్ హీరోయిన్ నేహా కూడా ఒకరు.
ఇకపోతే ఈమె పేరు చెప్తే జనాలకు అంతగా గుర్తుకు రాకపోవచ్చు. కానీ సూపర్ హిట్ సినిమా దిల్ లో నటించిన హీరోయిన్ అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. హీరో నితిన్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్స్ సినిమాగా నిలిచిన సినిమాలలో దిల్ కూడా ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్ గా నేహా నటించింది. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు విపరీతంగా ఫిదా అయిపోయారు. అద్భుతమైన నటనతో మెప్పించారు. ఈ సినిమాతో మంచి పాపులారిటీ కూడా దక్కించుకున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాతో నేహాకు వచ్చిన క్రేజ్ రీత్యా అందరూ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలు పాటు ఈమెకు అవకాశాలు వస్తాయని ఇండస్ట్రీని ఏలేయడం ఖాయం అని కూడా భావించారు. కానీ ఊహించిన రేంజ్ లో ఈమెకు అవకాశాలు లభించలేదు. సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాలలో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో సైడ్ క్యారెక్టర్ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంది. దాంతో కూడా సక్సెస్ అందకపోవడంతో బాలీవుడ్ సీరియల్స్ వైపు మొగ్గు చూపింది నేహా.
సీరియల్స్ ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈమెకు అవకాశాలు వరుసగా తలుపు తట్టాయి. ఇక దాంతో పలు సీరియల్స్ చేస్తూ బిజీగా గడుపుతున్న సమయంలోనే 2010లో కృశాంత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి