అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన పుష్ప-2 ఎట్టకేలకు ఈరోజు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడంతో పాటుగా ఇతర దేశాలలో కూడా పుష్ప-2 మానియా భారీగా కనిపిస్తోంది. పుష్ప-2 సినిమా చూసిన వారందరూ కూడా పొగిడేస్తూ ఉన్నారు.. అటు డైరెక్టర్ సుకుమార్ ని, అల్లు అర్జున్, రష్మిక, జగపతిబాబు, రావు రమేష్, ఫహద్ ఫాజిల్ , అనసూయ అందరూ కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ తన మటనతో విశ్వరూపం చూపించారని.. అభిమానులు పలువురు నెటిజెన్స్ తెలియజేస్తున్నారు..


ఏ సినిమాకైనా సెకండాఫ్ చాలా కీల‌కం. అక్క‌డ సినిమాని నిల‌బెట్టే ఎపిసోడ్లు రెండో మూడో కావాలి. ఆ మూడు ఎపిసోడ్లు ఇవ్వాల్సిన కిక్ ‘జాత‌ర‌’ ఇచ్చేసింది. జాత‌ర ఎపిసోడ్ గురించి ముందు నుంచీ చాలా చ‌ర్చ న‌డిచింది. సినిమాలో ఈ సీన్ దాదాపు 30 నిమిషాలు ఉంటుంద‌ని, అందుకోసం బాగా ఖ‌ర్చు పెట్టార‌ని చెప్పుకొన్నారు. అయితే ఈ ఎపిసోడ్ 30 నిమిషాల్లా అనిపించ‌దు. ఎప్పుడు మొద‌లైందో, ఎప్పుడు ముగిసిందో తెలీదు. అంత‌లా ప్రేక్ష‌కుల్ని ఇన్వాల్వ్ చేసిన ఎపిసోడ్ అది. జాత‌ర పాట‌లో బ‌న్నీ న‌టించ‌లేదు. విశ్వ‌రూపం చూపించాడు అనేది చాలా చిన్న మాట‌గా అనిపిస్తుంది. పాట‌లో బ‌న్నీ ఎక్స్‌ప్రెష‌న్స్‌, ఆడిన తాండ‌వం… ‘న భూతో’ అనుకోవొచ్చు. మ‌రో ప‌దేళ్ల పాటు ఈ ఎపిసోడ్ గురించి చెప్పుకొనేలా బ‌న్నీ న‌ట‌న సాగింది.  



విమర్శకుల నోటి నుంచి కూడా ప్రశంసలు అందుకుంటూ ఉండడంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా  సంతోషంగా ఉన్నప్పటికీ.. అయితే థియేటర్ల వద్ద జరుగుతున్న కొన్ని సంఘటనలు కాస్త అభిమానులను కలవరపెడుతున్నాయి.. ఇప్పటికే సంధ్యా థియేటర్ వద్ద    తొక్కిసలాట జరగడంతో ఈ ఘటనలో ఒక మహిళ సైతం మృతి చెందగా ఆమె కుమారుడు ఇప్పుడు చాలా విషయంగా ఉందనే విధంగా వార్త వినిపిస్తున్నాయి. మొత్తానికి అల్లు అర్జున్ సైతం ఇలాంటి సంఘటన మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: