ఐ కెన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ లో హీరోగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల అయిన సంగతి కూడా తెలిసుందే. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని మాత్రం అందుకుంటుందో లేదో చూడాలి. ఐ కెన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 మూవీ నేడు దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది. మోస్ట్ ఎవైటెడ్ చిత్రం పుష్ప-2 ది రూల్' థియేటర్లలో సందడి చేస్తుంది. కొన్ని ఎరియాల్లో డిసెంబర్ 4 రాత్రి నుంచి ఈ మూవీ ప్రీమియర్ షోలు పడ్డాయి.

 కొన్ని చోట్ల గురువారం డిసెంబర్ 5 తెల్లవారుజామున 4 గంటల నుంచి పుష్ప-2 ది రూల్ షోలు మొదలయ్యాయి. బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా... మూవీ లవర్స్ అందరూ పుష్ప-2 మూవీని చూడటానికి వెళ్తున్నారు. పుష్ప-2 మూవీ ఇప్పటికే నెట్టిండా ట్రెండ్ అవుతోంది. నేషనల్ వైల్ గా పుష్ప-2 గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా, పుష్ప-2 మూవీ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. ప్రముఖ శని విమర్శకుడు తరుణ్ ఆదర్శ్ ఈ పుష్ప-2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్ ఇచ్చారు. ఈ మూవీ గురించి ఒక మాటలో మెగా బ్లాక్ బస్టర్ అంటూ తరుణ్ ఆదర్శ్ ట్విట్ చేశారు.

ఆయన అయితే ఏకంగా పుష్ప-2 ది రూల్ కి 4.5 రేటింగ్ ఇచ్చారు. " ఇది వైల్డ్ ఫైర్ ఎంటర్టైనర్... మూవీ చూస్తున్నంత సేపు ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది... ఈసారి అవార్డులన్నీ అల్లు అర్జున్ దక్కుతాయి. బన్నీ నటన అయితే సూపర్. క్రూరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫహద్ ఫాసిల్ బాగా నటించాడు. మూవీలో వీరిద్దరి కాంబో సీన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమా ఫోకస్ అంతా అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ పైనే ఉంది. రష్మిక మందన తన నటనతో దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీకి దర్శకుడు సుకుమార్ జాదూగర్.. బాక్స్ ఫీస్ తుపాను వచ్చేసింది " అంటూ ట్విట్ లో తరుణ్ ఆదర్శ్ తన రివ్యూలో రాసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: