తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఇది ఇలా ఉంటే దిల్ రాజు కొన్ని సంవత్సరాల క్రితం సునీల్ హీరోగా వాసు వర్మ దర్శకత్వంలో కృష్ణాష్టమి అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే తాజాగా దిల్ రాజు ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆ సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలను దిల్ రాజు వివరించాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... వాసు వర్మ మా బ్యానర్లో మొదటగా జోష్ సినిమా చేశాడు. ఆ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత అతనితో మరో సినిమా చేయాలి అని నేను అనుకున్నాను. అందులో భాగంగా కొన్ని కథలను వినడం మొదలు పెట్టాను. ఒక సారి నాకు కోన వెంకట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కథను వినిపించాడు. అది నాకు బాగా నచ్చింది. ఆ కథను వాసు వర్మను వినమని చెప్పాను. ఆయన కూడా విన్నాడు. అది ఆయనకు కూడా బాగా నచ్చింది. వెంటనే ఆ కథతో వాసు వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి అనుకున్నాం. ఇక సినిమా స్టార్ట్ అయ్యే లోపు మేము ఆ కథను గెలవడం మొదలు పెట్టాం. కథలో అనేక మార్పులు చేర్పులు చేశాం. దానితో ఆ సినిమా కథ చాలా వరకు మారిపోయింది.

అవుట్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కాస్త వేరే కథలా మారిపోయింది. ఇక ఆఖరిగా సునీల్ ని పెట్టి ఆ మూవీ ని రూపొందించాం. ఇక విడుదల అయిన తర్వాత ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలా మేము కోన వెంకట్ ఇచ్చిన కథను నేరుగా తీసి ఉంటే ఆ సినిమా హిట్ అయ్యేదేమో ... మేము అనవసరంగా మార్పులు , చేర్పులు చేసి ఆ సినిమా ఫ్లాప్ కావడానికి కారణం అయ్యాము అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: