తాజాగా పాడుతా తీయగా సింగింగ్ షో పై జూనియర్ సింగర్ ప్రవస్తి చేసిన కామెంట్లు మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ముఖ్యంగా సింగర్ సునీతపై, కీరవాణిపై ప్రవస్తి చేసిన కామెంట్లపై చాలామంది సీనియర్ సింగర్స్ గుర్రుగా ఉన్నారు. అంతేకాదు ఆమె మాట్లాడిన మాటలు అన్ని తప్పు అనేట్లుగా పిన్ టూ పిన్ ఎన్నో వీడియోలు రిలీజ్ చేస్తూ ప్రభాస్ కి షాక్ ఇస్తున్నారు. అయితే సింగర్స్ వివాదం నెలకొన్నవేళ తాజాగా ఓ స్టార్ సింగర్ విడాకులు తీసుకోబోతుంది అంటూ కొంతమంది నెటిజన్లు ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హారిక నారాయణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ప్లే బ్యాక్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న హారిక నారాయణ్ తాజాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.

 దానికి కారణం పాడుతా తీయగా షోలో ప్రవస్తి తనకు జరిగిన అన్యాయం బయటపెట్టి హారిక నారాయణ్ ఉన్న వీడియో కూడా రిలీజ్ చేయడంతో నా వీడియో ఎందుకు ఉపయోగించారు అని హారిక ఫైర్ అయింది.దీంతో ఒక్కసారిగా  హారిక నారాయణ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అయితే తర్వాత హారిక నారాయణ్ ఇంస్టాగ్రామ్ చూసి చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో తన భర్తతో దిగిన ఫోటో ఒక్కటి కూడా లేదు.భర్తతో దిగిన పెళ్లి ఫోటోలు పెళ్లికి ముందు దిగిన ఫోటోలు పెళ్లి తర్వాత దిగిన ఫోటోలు అన్నీ కూడా డిలీట్ చేయడంతో హారిక నారాయణ్ తన భర్తతో విడాకులు తీసుకోబోతుందని చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ లో ఒకరిని ఒకరు ఫాలో చేసుకుంటున్నప్పటికీ ఫోటోలు మాత్రం డిలీట్ చేయడంతో వీరిద్దరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది.

ఇక హారిక నారాయణ్ మాత్రమే కాదు ఆయన భర్త ఇన్స్టాగ్రామ్ చెక్ చేసిన కూడా అందులో వీరి పెళ్లి ఫోటోలు డిలీట్ అయి ఉన్నాయి. దాంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని,అందుకే తమ పెళ్లి ఫోటోలను కలిసున్న ఫోటోలను అన్నింటిని డిలీట్ చేశారని నెటిజెన్లు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ హారిక నారాయణ్ విడాకుల రూమర్లు మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక గత సంవత్సరం పృథ్వినాథ్  అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న హారిక నారాయణ్ పెళ్లయిన ఏడాదికే భర్తతో విడాకులు తీసుకోబోతుంది అనే రూమర్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: