మొదట కమెడియన్గా తనకెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తున్న ప్రియదర్శి ఇటీవలే కోర్టు సినిమాతో కూడా అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా సారంగపాణి జాతకం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి సారంగపాణి జాతకం పూర్తి రివ్యూ ఇప్పుడు ఒకసారి చూద్దాం.


వెన్నెల కిషోర్, ప్రియదర్శి, వైవా హర్ష , సీనియర్ నరేష్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్ వంటి స్టార్స్ తో సారంగపాణి జాతకం సినిమాని తెరకెక్కించారు.

స్టోరీ విషయానికి వస్తే..
సారంగపాణి జాతకం చిత్రం 2 గంటల 15 నిమిషాలు ఉంటుంది. సారంగపాణి (ప్రియదర్శి) ఒక హుండాయ్ షోరూంలో సేల్స్ మాన్ గా పనిచేస్తూ ఉంటారు.. ఇక అదే షోరూంలో మేనేజర్ గా ఉన్న మైథిలి (రూప) తన లవర్.. కానీ సారంగపాణికి ఎక్కువగా జాతకాల పిచ్చి ఉంటుంది.. అలాంటి సమయంలో ఒక పార్టీలో జిగేస్వర్ (అవసరాల శ్రీనివాస్) తన చేతి రేఖలలో మరణ సహాయం చేసే జాతకం ఉందని చెబుతారు.. అయితే వివాహానికి సిద్ధమైన సారంగపాణి తన మిత్రుడు చందు (వెన్నెల కిషోర్) సహాయంతో ఆ మరణ సహాయం చేసి పెళ్లి చేసుకుందామనుకొని డిసైడ్ అవుతారు పాణి.. మరి ఆ మరణ సహాయం చేయగలుగుతాడా? లేదా?..  ఈ జాతకాల పిచ్చి వల్ల సారంగపాణి, రూప పెళ్లి జరుగుతుందా?ఎదుర్కొనే కష్టాల వల్ల చివరికి హీరో హీరోయిన్ లవ్ స్టోరీ ఏమవుతుందన్నదే కథా అంశము..


సినిమా ఫస్ట్ ఆఫ్ నుంచి క్లైమాక్స్ వరకు కడుపుబ్బ నవ్వుకోవచ్చు.. ప్రియదర్శి, హీరోయిన్ రూప మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్గా ఉంటాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు అండ్ టర్న్ ప్రేక్షకులకు మరింత థ్రిల్లయేలా వెన్నెల కిషోర్, వైవాహర్ష ,ప్రియదర్శి ముగ్గురు కూడా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ కామెడీ సినిమా అని చెప్పవచ్చు మొత్తానికి ఈ సినిమా అని ముగ్గురు కలిసి పవర్ ఫుల్ కామెడీతో సక్సెస్ చేశారు. మొదటిరోజు కలెక్షన్స్ తో ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: