
నా ఫ్రెండ్, సోదరుడు, కుటుంబ సభ్యుడు, రక్త సంబంధీకుడా అని చెప్పలేనని సమంత పేర్కొన్నారు. ఫ్యాన్స్ గురించి సైతం సమంత కామెంట్లు చేశారు. ఇంతమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకోవడం నా అదృష్టం అని సామ్ వెల్లడించారు. లక్ తో పాటు నేను పడిన కష్టమే ఈరోజు ఇంతమంది అభిమానానికి కారణం అని సమంత పేర్కొన్నారు.
ఇది నేను దేవుడిచ్చిన వరం అని నేను భావిస్తానని సమంత వెల్లడించడం గమనార్హం. మనం తీసుకునే ఒక్క నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేమని సమంత అన్నారు. ఒకవేళ ఎవరైనా అలా డిసైడ్ చేస్తే అది అబద్ధమే అవుతుందని సమంత అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. తెలిసీ తెలియక తీసుకున్న ఎన్నో నిర్ణయాలు కెరీర్ పై ప్రభావం చూపుతాయని ఆమె పేర్కొన్నారు.
డైరెక్టర్ సుధా కొంగర మాట్లాడుతూ సమంతకు నేను అభిమానినని ఐదేళ్లుగా ఆమెను దగ్గరనుంచి చూస్తున్నానని ఆమె పేర్కొన్నారు. 5 సంవత్సరాలుగా సమంతను దగ్గరినుంచి చూస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. సమంత బాధ పడినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చేవని సమంతను చూసి ఎంతోమంది అమ్మాయిలు ధైర్యం తెచ్చుకోవాలని సుధా కొంగర పేర్కొన్నారు. సమంతతో యాక్షన్ ఫిల్మ్ చేయాలని సుధా కొంగర భావిస్తున్నారు. సమంత కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కావాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. సమంత పారితోషికం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.