ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీతో బన్నీ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. ఇతర స్టార్ హీరోలతో సైతం బన్నీకి మంచి అనుబంధం ఉంది. విజయ్ దేవరకొండ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు గిఫ్ట్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. తాజాగా విజయ్ దేవరకొండ హైదరాబాద్ లో తన రౌడీ బ్రాండ్ స్టోర్ ను ప్రారంభించడం జరిగింది.
 
ఈ సందర్భంగా బన్నీకి విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ డ్రెస్ లను పంపడంతో పాటు బన్నీ పిల్లల కోసం బర్గర్లను పంపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బన్నీ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది. బన్నీ తన పోస్ట్ లో మై స్వీట్ బ్రదర్.. నువ్వు ఎప్పుడూ సర్ప్రైజ్ చేస్తుంటావ్.. సో స్వీట్ అని పేర్కొన్నారు. అల్లు అర్జున్ కు విజయ్ ఇలా బహుమతులు పంపడం ఇదే తొలిసారి కాదు.
 
పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ సమయంలో విజయ్ దేవరకొండ బన్నీకి పుష్ప పేరుతో ఉన్న టీ షర్ట్ లను పంపడం జరిగింది. ఆ సమయంలో వాటిని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ "నా స్వీట్ బ్రదర్.. నీ ప్రేమకు కృతజ్ఞతలు" అని బన్నీ చెప్పుకొచ్చారు. బన్నీ అట్లీ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఒకింత భారీ బడ్జెట్ తో, భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
 
అల్లు అర్జున్ ఈ సినిమా కోసం 200 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇతర భాషల్లో సైతం మరింత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బన్నీ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: