ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అయిన పేర్లు ఏవైనా ఉన్నాయి అంటే మాత్రం కచ్చితంగా అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. అదే విధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పుకోక తప్పదు . ఇద్దరికీ ఇద్దరే సినిమాల పరంగా టాప్ పొజిషన్లో ఉన్నారు . అంతేకాదు ఇద్దరూ కూడా పాన్ ఇండియా  సినిమాలు చేస్తూ ఒక్కొక్క సినిమాకి 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. రీసెంట్గా వీళ్ళిద్దరి ఫ్యాన్స్ ఏ విధంగా సోషల్ మీడియాలో వార్  చేసుకున్నారో అందరికీ తెలిసిందే.


ఫ్యామిలీ గొడవలు కాస్త సినిమా ఇండస్ట్రీ రెండు ముక్కలుగా చీలిపోయే వరకు తెచ్చారు ఈ స్టార్ హీరోలు అంటూ సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు . అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రాంచరణ్ నటిస్తున్న "పెద్ది" సినిమాకి సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఇలాంటి గెటప్ లో కనిపించాడు రామ్ చరణ్ "పెద్ది" సినిమాలో అలా కనిపించబోతున్నాడు అంటూ రిలీజ్ అయిన లుక్స్ ఆధారంగా ట్రోల్ చేస్తున్నారు.  అయితేపుష్ప రాజ్ ని తొక్కేయడానికి చరణ్ చాలా చాలా కష్టపడుతున్నాడు అని ..అందులో భాగంగానే "పెద్ది" సినిమాలో ఒక్క డూప్ కూడా లేకుండా పూర్తిగా స్టంట్స్  మొత్తం ఆయన స్వయంగా చేశాడు అని ఓ న్యూస్ బయటకి వచ్చింది.



ఈ సినిమాతో ఆయన మరో బిగ్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు.  సినిమా రిలీజ్ అయితే అసలు మేటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. కానీ చాలామంది పుష్ప సినిమా గెటప్ లో ఆల్ రెడీ బన్నీ ని చూసిన లుక్స్ లో రామ్ చరణ్ ని చూస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ ని కాపీ కొట్టాడని అంటారు అంటూ బన్నీ ఫ్యాన్స్ కూసింత ఓవర్ గానే ట్రోల్ చేస్తున్నారు. చూద్దాం మరి "పెద్ది" సినిమా ఏ రేంజ్ లో చరణ్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తుందో...??

మరింత సమాచారం తెలుసుకోండి: