రీసెంట్ గా ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ బెట్టింగ్ యాప్స్ చేసే వారి గురించి అలాగే బిగ్ బాస్ తర్వాత కోట్లు సంపాదించిన వారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పహల్ గామ్ అటాక్ జరిగాక కొంతమంది భారత దేశంలో ఉన్న ముస్లింలను ఉగ్రవాదులుగానే చిత్రీకరిస్తున్నారు. అయితే ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారందరూ ఉగ్రవాదులే అంటూ యూట్యూబర్ అన్వేష్ చెప్పడంతో దీనిపై ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు బిగ్ బాస్ సోహెల్.. బిగ్ బాస్ లోకి రాకముందు పలు సీరియల్స్ చేసిన సోహెల్ బిగ్ బాస్ లోకి వచ్చాక మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక సినిమాల్లో హీరోగా మారి చిన్న చిన్న సినిమాలు చేస్తున్నారు.అయితే అలాంటి సోహెల్ పై రీసెంట్గా నా అన్వేషణ అన్వేష్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై సోహెల్ మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఉగ్రవాదులని ముద్ర వేసేస్తారా.. 

నేను భారతీయుణ్ణే.. కులమతాలు లేకుండా ఈ దేశంలో ఉంటున్నాను. బెట్టింగ్ యాప్స్ చేస్తే నన్ను తిట్టండి.కానీ ఉగ్రవాది అని ముద్ర వేయడానికి,టెర్రరిస్ట్ అనడానికి వాడెవడు. వాడెవడో నన్ను మాత్రమే కాదు చనిపోయిన నా తల్లిని కూడా తన వీడియోలో ఘోరంగా తిట్టాడు.అయితే ఆ వీడియో డిలీట్ చేయమని బతిమిలాడుకున్నాను.అయినా డిలీట్ చేయలేదు. కానీ నాలాగే నీకు కూడా ఓ తల్లి ఉంది. చనిపోయిన నా తల్లిని నువ్వు తిడితే అది నీకే నష్టం. మా అమ్మని బూతులు తిట్టావు.అయినా కూడా నేను నిన్ను నీ తల్లిని ఏమీ అనను.ఎందుకంటే అందరి తల్లులు నాకు సమానమే.నీ పేరెంట్స్ ని నువ్వు బాగా చూసుకో అని మెసేజ్ చేసి వీడియో డిలీట్ చేయమని చెప్పినా వినలేదు. మీ వ్యూస్ కోసం ఎలాంటి మాటలు అయినా మాట్లాడతారా.. నేను ఓ క్రిస్టియన్ ఫ్రెండ్ తో కలిసి చర్చికి వెళ్తాను. అలాగే మా ఇరుగుపొరుగు వారితో కలిసి కొండగట్టు వెళ్లాను. అలాగే శివుడికి పాలాభిషేకం కూడా చేస్తాను.

 సంక్రాంతి వచ్చిందంటే అందరు హిందువుల లాగే మేము మా ఇంట్లో పిండి వంటలు చేసుకుంటాము.. అలాగే రంజాన్,బక్రీద్ వంటి ఫెస్టివల్స్ వస్తే మా ఇంట్లోకి ఎంతోమంది హిందూ మిత్రులు, క్రిస్టియన్ మిత్రులు వచ్చి నాతో నమాజ్ చదివి ఆ రోజంతా నాతో గడుపుతారు. కులమతాలకు అతీతంగా ఉన్న భారత దేశంలో ఉన్న నన్ను ఉగ్రవాది అని ముద్ర వేస్తే ఊరుకునేది లేదు. నేను కూడా భారతీయుడినే.. ఇస్లాంలో నేను పుట్టించిన మనిషిని నువ్వు చంపే హక్కు లేదు అని రాసి ఉంటుంది. ఉగ్రవాదులు నిజమైన ముస్లింలు అయితే మనుషులను చంపే హక్కు వారికి లేదు.వారు ముస్లిం ముసుగులో ఉన్న ఉగ్రవాదులు మాత్రమే. మీ కోపతాపాలు నిజమైన ఉగ్రవాదుల మీద చూపించకుండా నాలాంటి వాళ్ళ మీద చూపిస్తే జరిగేదేమి ఉండదు. ముఖ్యంగా ఆ ఉగ్రవాదులు మనలో మనకు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఒకవేళ మనలో మనం కొట్టుకు చస్తే ఆ ఉగ్రవాదుల ప్లాన్ ఫలించినట్టే అంటూ బిగ్ బాస్ సోహెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: