హీరో సూర్య, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, జయం రవి తదితర నటీనటుల కాంబినేషన్లో వచ్చిన రెట్రో సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెప్పించారు. ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కించారు.


స్టోరీ విషయానికి వస్తే:
1993 సమయంలో జరిగే కథ అన్నట్టుగా తెలుస్తోంది. చిన్నతనంలోనే పారివేల్ కణ్ణన్ (సూర్య) తన తల్లిదండ్రుల నుంచి దూరమై ఒక గ్యాంగ్ స్టార్ తిలక్ రాజు (జోజు జార్జ్) కు దొరుకుతారు. అయితే అతని భార్య కు ఇష్టం ఉండడంతో పారివేల్ కణ్ణన్ వీరి దగ్గరే పెరుగుతూ ఉంటారు. అయితే చిన్నతనం నుంచి పారి ఎక్కడికి వెళ్లినా సరే తనకి కుటుంబం అనేది ఉండదు. ఆ తర్వాత రుక్మిణి (పూజా హెగ్డే) పరిచయమే ఏర్పడి ఎలా ప్రేమగా మారి ఆ తర్వాత తన కోపం, నవ్వు వంటివి పారి జీవితంలోకి ఎలా వస్తాయి అసలు ఈ పారి ఎవరు ? అండమాన్ దీవులలో ప్రజలు బానిసలుగా ఉన్నటువంటి దొరల చేస్తున్నా అరాచకాలకు అక్కడికి వెళ్లి ఎందుకు ఎదిరిస్తారు.. గోల్డ్ షిప్ కి పారేకి ఉన్న సంబంధం ఏంటి అనేది కథ.


ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో మొదటి భాగం.. మేకర్స్ చెప్పినట్లుగానే లవ్ లాఫ్టార్ పాయింట్స్ తగ్గట్టుగా కథ నడిచింది. సూర్య నటనకు సాలిడ్ రెస్పాన్స్.


సూర్య పైన క్రేజీ సీన్స్ యాక్షన్ సన్నివేశాలు ఎమోషనల్ సన్నివేశాలు.


పూజా హెగ్డే నటన అద్భుతంగా ఉంది. వీటికి తోడుగా జోజు జార్జ్ అద్భుతంగా నటించారు. అలాగే నెగిటివ్ పాత్రలో కనిపించిన నటుడు విదు. అలాగే డైరెక్టర్ ఎంచుకున్న ప్రత్యేకమైన పాయింట్.

మైనస్:
డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు సెకండాఫ్ ని తెరకెక్కించడంలో తడబడ్డారు.


కథ ఒకచోట మొదలై అది కాస్త ఎటేటో వెళ్లిపోతుంది. సూర్య సన్నివేశాలు స్లో లో కరెక్టుగా లేవని.. అలాగే ఫ్రీ క్లైమాక్స్ సూర్య పైన ట్విస్ట్.

క్లైమాక్స్ అంత ఎఫెక్టివ్ గా అనిపించకపోవడం.


మొత్తానికి రెట్రో సినిమా మంచి కీ పాయింట్స్ తోనే కనిపిస్తోంది. అలాగే ఇందులో సూర్య సాలిడ్ నటన మెయిన్ పిల్లర్గా నిలిచారు. మొత్తానికి సూర్య అభిమానులకు ఈ సినిమా అంచనాలను అందుకున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: