సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం "ఎల్లమ్మ". ఈ సినిమాకు సంబంధించి చాలా రోజుల నుంచి అనేక రకాలు వార్తలు తెర పైకి వస్తూనే ఉన్నాయి. దర్శకుడు వేణు కమెడియన్ గా తన కెరీర్ ప్రారంభించి దర్శకుడిగా మారాడు. బలగం సినిమాకు దర్శకత్వం వహించిన వేణు ఇప్పుడు మరో సినిమాతో అభిమానుల ముందు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథను సిద్ధం చేసుకుని వేణు రెడీగా ఉన్నారట. అయితే ఈ సినిమాలో హీరోగా నానిని అనుకుంటున్నారు. హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకుంటున్నట్లుగా చాలా రోజుల నుంచి అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. 

కీర్తి సురేష్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని మరో వార్త వైరల్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో వీరిద్దరు హీరోయిన్లను కాకుండా ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ గా నటి శ్రీ లీలను పెట్టి సినిమా తీయాలని నిశ్చయించుకున్నట్లుగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు ఉందో తెలియదు కానీ శ్రీ లీల, నాని కాంబినేషన్లో సినిమా తీసినట్లైతే మంచి విజయాన్ని సాధిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. ప్రస్తుతం శ్రీ లీల సినిమాల పరంగా మంచి ఫామ్ కొనసాగిస్తున్నారు.

వరుస సినిమాలలో నటిస్తూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని దర్శకుడు వేణు వెల్లడిస్తే కానీ అసలు విషయం బయటికి రాదు. బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన బలగం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా తర్వాత వేణు మరిన్ని సినిమాలు తీయాలని తన అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. ఇక ఎల్లమ్మ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: