నాగార్జున.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో .. ఏజ్ 65 ప్లస్ కానీ అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం వేరే లెవెల్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబుకి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.  అయితే ఇప్పటికీ అలాంటి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఏకైక టాలీవుడ్ టాప్ సీనియర్ హీరో నాగార్జున అని మాత్రమే చెప్పాలి . వెంకటేష్ కి ఫ్యామిలీ లేడీస్ ఎలా పడిపోతారో .. నాగార్జునకి గర్ల్స్ అలా పడిపోతూ ఉంటారు.  ఏజ్ 60 ప్లస్ క్రాస్ చేసిన సరే ఇప్పటికి హ్యాండ్సం లుక్స్ లో మెరుస్తూ ఉంటాడు. అటువంటి నాగార్జున తన వందవ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది .


నాగార్జున తన కొడుకులకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా నాగచైతన్య ఎక్స్ సినిమా విషయంలో నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నాడు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . నాగార్జున ఇచ్చిన సలహా మేరకే నాగచైతన్య ముందుకు వెళ్లాలి అంటూ డిసైడ్ అయ్యారట.  మనకు తెలిసిందే రీసెంట్గా తండేల్ సినిమాతో సూపర్ సూపర్ హిట్ అందుకున్న నాగచైతన్య .. ప్రజెంట్ విరుపాక్ష డైరెక్టర్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు.  నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే అని అనుకున్నారట .



ఎప్పటినుంచో ఇదే ప్రచారం జరిగింది. అయితే డైరెక్టర్ కూడా పూజ హెగ్డే ఈ పాత్ర ఇవ్వాలి అంటూ అనుకున్నారట . కానీ రీసెంట్గా రెట్రో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ టాక్ అందుకున్న తర్వాత పూజ హెగ్డేసినిమా నుంచి తప్పించాలి అంటూ నాగార్జున డిసైడ్ అయ్యారట . కానీ నాగచైతన్య - కార్తీక్ మాత్రం ఈ సినిమాలో హీరోయిన్గా పూజ నే ఉంటే బాగుంటుంది అంటూ డిసైడ్ అయ్యారట.  కానీ నాగార్జున మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అలాంటి హీరోయిన్ మనకు వద్దు ఇప్పుడిప్పుడే హిట్స్ కొడుతున్నావ్ రిస్క్ చెయ్యొద్దు అంటూ నాగచైతన్యకు కూర్చోబెట్టి మరి సజెషన్స్ ఇచ్చారట.  నాగచైతన్య కూడా నిజమేగా అంటూ పూజ హెగ్డే ప్లేస్ లో మరొక హీరోయిన్ ని తీసుకునే ఆలోచన చేస్తున్నాడట..!

మరింత సమాచారం తెలుసుకోండి: