
నిన్నే పెళ్లాడతా లేదా గుండమ్మ కథ రీమేక్ చేయాలని అభిమాని కోరగా మంచి ఆలోచన అని 150 కోట్ల రూపాయలు తీసుకొస్తే దుల్లగొట్టేద్దామని కృష్ణవంశీ కామెంట్లు చేశారు. చిరంజీవితో ఒక సినిమా చేయలానే ఆలోచన నాకు కూడా ఉందని ఎప్పటినుంచో ఆయనను సైతం అడుగుతున్నానని చెప్పుకొచ్చారు. నా బ్యాడ్ లక్ అని చిరంజీవితో రుద్రవీణ లాంటి సినిమా తీసే లక్ నాకు లేదని ఆయన వెల్లడించారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు జూనియర్ కాదని తారక్ స్థాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ అని తారక్ తో సినిమాను తెరకెక్కించడానికి తాను సరిపోనని కామెంట్లు చేశారు. ఖడ్గం2 తీసే ఆలోచన లేదని అది సాధ్యం కాదని క్షమించాలని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. ఓటీటీ కంటెంట్ చేయాలని ఉందని తాను రాస్తున్నానని ఆయన తెలిపారు. కాజల్ అగర్వాల్ తో ఫ్యాన్స్ మాట్లాడితే ఆమె ఓకే అంటుందేమోనని ఆయన కామెంట్లు చేశారు.
కృష్ణవంశీ డైరెక్టర్ గా మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కృష్ణవంశీ రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. కృష్ణవంశీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్వరలో కృష్ణవంశీ మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.