పాన్ ఇండియన్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. ఇప్పటివరకు అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. రామాయణం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన ఎన్టీఆర్ అనేక సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ తర్వాత 1997లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. 


ఆ సినిమాలో ఎన్టీఆర్ తనదైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. మొదటి సినిమాతోనే హీరోగా సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ అనేక సినిమాలలో నటించాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా మారాడు. ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ వార్-2 సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్నాడు.

 మరోవైపు ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా షూటింగ్ లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది. డ్రాగన్ సినిమాలో సీనియర్ నటి టబూ కీలకపాత్రను పోషించనుందట.


ఏకంగా ఎన్టీఆర్ కు తల్లి పాత్రను పోషించే అవకాశాలు ఉన్నట్లుగా సినీ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ టబు ఈ సినిమాలో నటించినట్లయితే సినిమాకే ప్లస్ పాయింట్ అవుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారట. త్వరలోనే టబూ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టుగా ఓ వార్త వినిపిస్తోంది. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: