
ఈ సినిమాలో హీరోయిన్లుగా కేథరిన్ ధెరిస్స.. అదేవిధంగా నయనతార ఫైనలైజ్ అయిపోయారు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి చాలా నాటీ పాత్రలో కనిపించబోతున్నాడట . అంతేకాదు సమయానుసారం ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందట .ఈ సాంగ్ లో చిరంజీవి ఓ రేంజ్ లో డ్యాన్స్ స్టెప్స్ ఇరగదీసే విధంగా ప్లాన్ చేశారట అనిల్ రావిపూడి . అత్తారింటికి దారేది సినిమాలో "కాటమరాయుడా" సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఆ రేంజ్ కి మించిపోయేలాగే ఈ సినిమాలో కూడా కొన్ని కామెడీ బిట్స్ ని ప్లాన్ చేశారట .
కాగా అనిల్ రావిపూడి చిరంజీవి నటిస్తున్న సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతుంది హీరోయిన్ పూర్ణ అంటూ న్యూస్ బయటకు వచ్చింది. ఆమె గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన కుర్చీ మడత పెట్టి సాంగ్ లో అదరగొట్టేసింది. ఈ పాట ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఆ తర్వాత తెరపై పెద్దగా కనిపించలేదు . ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకి ఓకే చేసింది అని తెలియడంతో మరొకసారి పూర్ణ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అనిల్ రావిపూడి ఈ మధ్య కాలంలో ఢిఫరేంట్ గా ఆలోచిస్తున్నాడు. చూద్దం మరీ కాంబో ఎంత వరకు సక్సెస్ అవుతుందో...??