టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో అంచెలంచలుగా ఎదుగుతున్న శ్రీవిష్ణు సింగిల్ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11.20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో 3 లక్షల డాలర్ల మార్క్ ను సాధించడం గమనార్హం.
 
సింగిల్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లతో పోల్చి చూస్తే రెండో రోజు కలెక్షన్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. రెండో రోజు ఏకంగా 7 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న సింగిల్ మూవీకి ఈరోజు కూడా బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా అన్ని ఏరియాల్లో సింగిల్ మూవీ అదరగొడుతోంది. శ్రీవిష్ణు కెరీర్ లో గత హిట్ సినిమాల కలెక్షన్లను భారీ మార్జిన్ తో ఈ సినిమా క్రాస్ చేస్తోంది.
 
ఈ ఏడాది తండేల్ సినిమాతో సక్సెస్ అందుకున్న గీతా ఆర్ట్స్ బ్యానర్ కు సింగిల్ సినిమాతో లాభాల విషయంలో అంతకు మించిన విజయం దక్కిందనే చెప్పాలి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా కార్తీక్ రాజు ఈ సినిమాను తెరకెక్కించగా ఈరోజు కలెక్షన్లతో ఓవర్సీస్ లో ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ కలెక్షన్లను క్రాస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శ్రీవిష్ణు డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ స్కిల్స్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి.
 
శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. 24 గంటల్లోనే ఆన్ లైన్ టికెట్ బుకింగ్ యాప్స్ లో సింగిల్ సినిమాకు సంబంధించి 80 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. సమ్మర్ హాలిడేస్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా వీక్ డేస్ లో సైతం ఈ సినిమా అదరగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగిల్ శ్రీవిష్ణు రేంజ్ ను ఊహించని స్థాయిలో పెంచిందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: