"రామ్ పోతినేని"..గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీ లోకి ఆయన ఎలా ఎంట్రీ ఇచ్చాడు.. ఎలా తన కెరీయర్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాడు .. ప్రెసెంట్ హిట్స్ కోసం ఎలా ట్రై చేస్తున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా ప్రెసెంట్ రాం పోతినేని ..పి మహేష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు . కాగా ఈ సినిమాలో హీరో రామ్సినిమా హీరో అభిమానిగా కనిపిస్తాడు అంటూ న్యూస్ బయటకు వచ్చింది .


రామ్ లాంటి పాపులర్ హీరో ఆయన సినిమాలో మరొక హీరోకి అభిమానిగా కనిపించాలి అంటే ఆ హీరో క్యారెక్టర్ కచ్చితంగా టాప్ మోస్ట్ సెలబ్రిటీ అయి ఉండాలి.  అలానే ప్లాన్ చేసింది మైత్రి సంస్థ.  ఈ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా అంటూ బాగా ఆలోచించిందట . దాదాపు నెల రోజులపాటు ఆలోచించి ఫైనల్ గా ఒక హీరోని సెలెక్ట్ చేసుకుందట. ఆయన మరెవరో కాదు కన్నడ స్టార్ ఉపేంద్ర . నిజానికి బాలకృష్ణ దగ్గర నుంచి మోహన్ లాల్ వరకు చాలా పేర్లు ఈ పాత్ర కోసం వినిపించాయి . ఆఖరికి కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ని ఫైనల్ చేసుకున్నారు.



అయితే ఈ లుక్ డిఫరెంట్ గా ఉండాలి అని డిసైడ్ అయ్యారు మూవీ మేకర్స్. అందుకే లుక్ టెస్ట్ కూడా బాగా చేశారు.  ఇంకా ఉపేంద్ర పార్ట్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది అంటూ కూడా న్యూస్ బయటకు వచ్చింది . అంతేకాదు మే 15న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నారట.  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  న్యూస్ ప్రకారం ఏ మూవీకి "ఆంధ్ర కింగ్ తాలూకా" అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట.  ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అంటూ తెలుస్తుంది . అంటే సినిమాలో ఉపేంద్ర బిరుదు ఆంధ్ర కింగ్ అనే ఉంటుంది అంటూ రామ్ పోతినేని ఫ్యాన్స్ ముందుగానే గెస్ చేస్తున్నారు.  హీరో రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా అంటూ ..సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తర్వాత మళ్లీ ఆయనకు బ్రేక్ ఇచ్చే సినిమా ఈ ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ జనాలు రేంజ్ లో పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: