సమంత రాజ్ నిడిమోరులు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న వేళ అదొక్కటే అడ్డంకిగా మారింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఇంతకీ సమంత రాజ్ నిడిమోరుల పెళ్లికి అడ్డంకిగా ఉన్నది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సమంత రాజ్ నిడిమోరుల పెళ్లికి అతిపెద్ద అడ్డంకి రాజ్ నిడిమోరు రెండో భార్యనే .. అయితే మ్యారేజ్ యాక్ట్ చట్టం ప్రకారం భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోరాదు. భార్యకు విడాకులు ఇస్తేనే సమంత రాజ్ నిడిమోరుల పెళ్లికి లైన్ క్లియర్ అవుతుంది. కానీ శ్యామలీ దే మాత్రం రాజ్ కి విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేదట.. ఈ నేపథ్యంలోనే రాజ్ శ్యామలీ దే కి ఒక కూతురు కూడా ఉంది అంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది.

కానీ శ్యామలీ దే రాజ్ తో కలిసి ఉన్న అమ్మాయి వీరి కూతురు కాదని,ఆమె డైరెక్టర్ డీకే కూతురని తెలుస్తోంది.అయితే కూతురు కూడా లేకపోవడంతో వీరిద్దరికీ రెండో పెళ్లి జరగడం సులువే అవుతుంది అనుకున్నప్పటికీ శ్యామలీ దే రాజ్ నిడిమోరుకి విడాకులు ఇస్తేనే వీరి రెండో పెళ్లికి లైన్ క్లియర్ అవుతుంది.. అయితే వీరి రెండో పెళ్లి కి ఆటంకం వచ్చిన నేపథ్యంలో రెండో పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేయాలి అని నిర్ణయించుకున్నారట.

అయితే సహజీవనం చేయడం తప్పేమీ కాదు అని కోర్టులే తేల్చడంతో సమంత రాజ్ నిడిమోలు డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఇక వీరిద్దరూ కలిసి కొత్త జీవితం ప్రారంభించడం కోసం హైదరాబాదులో ఒక మంచి ఫ్లాట్ కోసం వెతుకుతున్నట్టు కూడా ఈ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి.. ఇక రాజ్ నిడిమోరు సమంతకి సంబంధించిన రెండో పెళ్లి వార్తలు ఎక్కువవ్వడంతో ఎప్పుడు సోషల్ మీడియాలో స్పందించని రాజ్ మొదటి భార్య శ్యామలీ దే కూడా ఎన్నో షాకింగ్ పోస్టులు సోషల్ మీడియాలో పెడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: