ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన సినిమాలకు కోట్లాది సంఖ్యలు అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే చాలు తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అల్లు అర్జున్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ హీరో రీసెంట్ గా నటించిన పుష్ప-2 సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 

అంతేకాకుండా పుష్ప-2 సినిమా 1800 కోట్లకు పైనే కలెక్షన్లను రాబట్టి అత్యంత ఎక్కువగా కలెక్షన్లు సంపాదించిన సినిమాగా రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నటించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అల్లు అర్జున్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్టుగా సినీ వర్గాల్లో ఓ వార్త వైరల్ అయింది. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్గా ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ను ఫైనల్ చేసినట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి.

అంతేకాకుండా ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్, మృనాల్ ఠాకూర్ కీలక పాత్రలను పోషిస్తారని సినీ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అయింది. ఈ సినిమాను దాదాపు రూ. 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ను ఆగస్టు నెలలో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు రిలీజ్ చేయాలని అట్లీ భావిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: