
టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. అందులో ప్రముఖ నటుడు మంచు విష్ణు ఒకరు. ఈ హీరో మోహన్ బాబు వారసుడిగా సినీ పరిశ్రమకు పరిచయమై తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నాడు. మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కీలకపాత్రను పోషించారు. ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ ప్రీతి ముకుందన్ నటిస్తోంది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు కన్నప్ప సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
ఈ సినిమా షూటింగ్ వేగంగా దాదాపుగా పూర్తయింది. ఈ సినిమాను తొందరలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ప్రభాస్ కన్నప్ప సినిమాలో చాలా తక్కువ సమయం మాత్రమే ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ కేవలం 30 నిమిషాల పాటు మాత్రమే కనిపిస్తారని తాజాగా విష్ణు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ప్రభాస్ చేస్తున్నది సినిమాలో ప్రత్యేక పాత్రే అయినప్పటికీ అతను 30 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు.
నాతో, మా నాన్నగారితో కాంబినేషన్ సీన్లు సినిమాలో చాలా ఎక్కువగా ఉన్నాయని విష్ణు అన్నారు. నాస్తికుడైన కన్నప్పను భక్తుడిగా మార్చడంలో ఆయన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మొత్తం సినిమా 3.10 గంటల నిడివి వచ్చిందని ఆయన వెల్లడించాడు. ప్రస్తుతం విష్ణు షేర్ చేసుకున్న ఈ విషయాలు సంచలనాలు రేపుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ను సినిమాలో కీలక పాత్రకు వాడుకోవడమే కాకుండా కేవలం 30 నిమిషాలు మాత్రమే సినిమాలో చూపిస్తారా అని ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. విష్ణు మాట్లాడే మాటలు ప్రభాస్ కు ఘోర అవమానాన్ని తీసుకువస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన విష్ణు, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య మరో వివాదం చెలరేగేలా కనిపిస్తుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. దీనిపైన హీరో ప్రభాస్ స్పందిస్తారో లేదో అనే సందేహంలో తన అభిమానులు ఉన్నారు.