సినిమా హీరోలని చూసి జనాలు ఎక్కువగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు . అయితే ఇప్పటి కాలంలో దేనిని చూసి ఇన్స్పైర్ అవుతున్నారో అందరికి బాగా తెలుసు.   వాళ్ళు వాడే డ్రెస్సింగ్ స్టైల్.. వాళ్ళ లైఫ్ స్టైల్ ..వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారు ..ఎలాంటి దుస్తులు ధరిస్తారు.. ఎలాంటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు .. ఇలాంటివి ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు . కానీ ఒకప్పుడు అలా కాదు ఒక హీరో ఏ మంచి పని చేసి తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడో అలాగే మనము చేస్తే మనకి మంచి పేరు వస్తుంది అనుకునే వాళ్ళు జనాలు . అప్పటికి ఇప్పటికీ చాలా ట్రెండ్ మారిపోయింది . జనాలు కూడా మారిపోయారు.  జనాలు ఆలోచించే పద్ధతి కూడా మారిపోయింది . అంతా టెక్నాలజీ మహిమ .


అయితే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది . ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు.  అందరిలోకి చాలా స్పెషల్ హీరో ఎన్టీఆర్ . ఆయన నటక తీరు ఆయన మాట్లాడేఅ పద్ధతి.. ఆయన ఎదుటి వాళ్ళతో ప్రవర్తించే తీరు ఒకటారెండా ఇలా చెప్పుకుంటూ ఉంటే పోతూ ఉంటే ఎన్నెన్నో .. . నేటి కాలంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు గారిలా ఒక్కరు కూడా లేరు అని చెప్పుకోవడంలో సందేహం లేదు అయితే ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేటితరం యువత ఏం నేర్చుకోవాలి ..?అనే విషయాన్ని ఇప్పుడు అభిమానులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . చాలామంది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు.


నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి . ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన  ఇంట్రెస్టింగ్ విషయాల గురించి జనాలు చర్చించుకుంటున్నారు .. మాట్లాడుకుంటున్నారు . ఇదే మూమెంట్లో స్వర్గీయ నందమూరి తారకరామారావు దగ్గర నుంచి నేటి యువత తీసుకోవాల్సిన లక్షణాలు ఏంటి..? ఆయనను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి ..? అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది . కాగా యువత ఆయన దగ్గర నుంచి ఏది తీసుకున్న తీసుకోకపోయిన నేర్చుకోవాల్సిన ఒకే ఒక విషయం మాత్రం కెరియర్ పై ఫోకస్ . మనం ఏం అవ్వాలనుకుంటున్నాం..? మనము ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నాం..? అనే విషయంపై కరెక్ట్ గా ముందుకు వెళ్లాలని చెప్పుకొస్తున్నారు.



నేటి యువత ఒకటి చదువుకుంటుంది మరొక పని చేస్తూ ఉంటుంది.  చదివిన చదువుకి ఉద్యోగానికి అస్సలు సంబంధం ఉండదు . అంతే కాదు ఎటువంటి కష్టాన్ని కూడా బేర్ చేయలేక పోతుంది . కానీ స్వర్గీయ నందమూరి తారకరామారావు తన లైఫ్ లో ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ పడ్డారు . ట్రబుల్స్ ఫేస్ చేశారు . ఎన్నో మాటలు అనిపించుకున్నాడు . కానీ ఆయన అనుకున్నా లక్ష్యాన్ని మాత్రం చేరుకోవడానికి అస్సలు వెనకడుగు వేయలేదు. ఆయనకున్న మొండి పట్టుదలే ఆయనను ఇప్పటికీ మనం గుర్తు చేసుకునేలా చేస్తుంది. ఆ విధంగా ఎవరైనా సరే ఒక పనిని చేయాలి అని డిసైడ్ అయితే ఆ పని చేసే విధంగా మొండి పట్టుదల ఉండడం చాలా చాలా మంచిది . అదే స్వర్గియ నందమూరి తారకరామారావు దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటున్నారు అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: