సూపర్ స్టార్ రజనీకాంత్ కు సౌత్ ఇండియాలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. రజనీకాంత్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న కూలీ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా 150 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకోగా లోకేశ్ కనగరాజ్ కు ఈ సినిమాకు సంబంధించి 50 కోట్ల రూపాయలు పారితోషికంగా దక్కినట్టు తెలుస్తోంది.
 
ఈ సినిమాకు మొత్తం 375 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఛాన్స్ ఉండగా నాన్ థియేట్రికల్ హక్కులతోనే 240 కోట్ల రూపాయలు వచ్చే ఛాన్స్ ఉందని భోగట్టా. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం థియేట్రికల్ హక్కులతో ఈ సినిమా సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవు. రజనీకాంత్ కు ఈ విషయంలో ఎవరూ సాటిరారని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
 
సూపర్ స్టార్ రజనీకాంత్ వయస్సు పెరుగుతున్నా అద్భుతమైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. రజనీకాంత్ రెమ్యునరేషన్ లెక్కలు విని ఇతర హీరోలు సైతం షాకవుతున్నారు. రజనీకాంత్ క్రేజ్, రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కు ఇంతకు మించ్న ప్రూఫ్ కావాలా అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రజనీకాంత్ రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
 
రజనీకాంత్ కెరీర్ బెస్ట్ ప్రాజెక్ట్ లను ఎంచుకొని సంచలనాలను క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. రజనీకాంత్ ఇతర భాషల్లో సైతం సంచలనాలు సృష్టిస్తే బాగుంటుందని చెప్పవచ్చు. రజనీకాంత్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. రజనీకాంత్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో ఇతర ఇండస్ట్రీలలో సైతం తన హవా చూపిస్తుండటం గమనార్హం. సూపర్ స్టార్ రజనీకాంత్ డెడికేషన్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. ఈయన రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: