సినీ నటుడు సుమంత్ అనగనగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో కాజల్ చౌదరి హీరోయిన్ గా నటించింది. అనగనగా సినిమాలో అవసరాల శ్రీనివాస్, అను హాసన్, రాకేష్ రాచకొండ ముఖ్య పాత్రలలో కనిపించారు. ఈ మూవీకి డైరెక్టర్ సన్నీ సంజయ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు రాకేష్ రెడ్డి గడ్డం, రుద్ర మదిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు చందు రవి సంగీతం అందించారు. ఈ సినిమా ఇప్పుడున్న ప్రజలకు చాలా చాలా అవసరం. ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది. ఈ మూవీలో సుమంత్ చాలా సహజంగా నటించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకుల మనసును ఎంతగానో ఆకట్టుకుంది.

దీంతో ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అవ్వాలని ప్రేక్షకులు డిమాండ్ చేశారు. వారి కోరిక మేరకు మొదటిసారి ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా థియేటర్ లోకి రాబోతుంది. ఈ సినిమా మంచి టాక్ ని అందుకోవడంతో సుమంత్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'నేను ఏదైనా సినిమా చేసే ముందు ఎక్కువగా స్క్రిప్ ని చదువుతాను. చదవగానే ఆ కథని ఓన్ చేసుకుంటాను. అలాగే డైరెక్టర్ పైన కూడా ఒక నమ్మకాన్ని ఏర్పరచుకొని.. ఆయనను ఫాలో అవుతూ ఉంటాను. నేను చేసిన సినిమాలన్నింటి పాత్రలంటే నాకు ఎంతో ఇష్టం. ఆ పాత్రలన్నీ నాకు చాలా స్పెషల్. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా కథకు న్యాయం చేయడమే నటుడిగా నా బాధ్యత' అని సుమంత్ చెప్పుకొచ్చారు.

హీరో సుమంత్ సినిమాలను ఎంచుకునే పద్ధతి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈయన చాలా తక్కువ సినిమాలతో తెరపైకి వచ్చినప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు. అయితే ఈయన నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందులో ముఖ్యంగా సత్యం, గోదావరి, మధుమాసం, గోల్కొండ హై స్కూల్, క్లాస్ మెట్, మళ్లీ రావా సినిమాలు మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: