మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబో లో వ‌స్తున్న‌ బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్ మూవీ వార్‌ 2 .. అయితే రీసెంట్ గానే వచ్చిన టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది .. అయితే ఈ ఐపీఎల్ ఫైనల్ నిన్న రాత్రి జరిగిన విషయం తెలిసిందే .. నిన్న రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అలాగే పంజాబ్ కింగ్స్ నడుమ జరిగిన ఈ ఉత్కంఠభరిత మైన పోరు లో ఎంతో స్పెషల్ గా వార్ 2 సరికొత్త ప్రోమో పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకుల కు బాగా రీచ్ అయ్యే విధంగా బాలీవుడ్ యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ సరికొత్త కంటెంట్ ని అక్కడ ప్లే చేస్తారని తెలుస్తుంది ..

అయితే అక్కడ ఐపీఎల్ వీక్షకులకు మాత్రం పాత టీజర్ లో క్లిప్ ని వేశారట .. అయితే స్పెషల్ ప్రోమో ఎందుకు మిస్ అయిందో ఇప్పుడు టాక్ బయటకు వచ్చింది .. ఇక దాని ప్రకారం ఆ ప్రోమో కి సంబంధించిన వి ఎఫ్ ఎక్స్ పనులు సరిగ్గా కంప్లీట్ కాకపోవడం కారణం గానే దాన్ని బయటకు వదల్లేదు అని తెలుస్తుంది .. దీని కారణం గా వార్ 2 కొత్త ట్రీట్ ప్రేక్షకుల కు ఐపీఎల్ ఫైనల్ వేదిక గా మిస్ అయిందట .. ఇక నిన్న మ్యాచ్ ఊపులోనే ఈ కొత్త గ్లింప్స్ కూడా వచ్చి ఉంటే సినిమా పై అంచనాలు మరో లెవల్లో ఉండేవని కూడా చెప్పవచ్చు .. ఇక ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆగస్టు 14 న పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: