
ఈ సినిమా విడుదలై 200 రోజులైన సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన బాలయ్య అభిమాని ఒకరు బాలయ్య పోస్టర్ పై పొట్టేళ్ల తలలు ఉంచి అభిమానాన్ని చాటుకున్నారు. పాతికేళ్ల క్రితమే బాలయ్యపై అభిమానుల్లో ఈ స్థాయిలో అభిమానం అయితే ఉంటుంది. సీడెడ్ లో డే1 కలెక్షన్ల విషయంలో బాలయ్య పేరిట ఎక్కువ సంఖ్యలో రికార్డులు ఉన్నాయి. బాలయ్య సినిమాలు ఇక్కడి ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటాయని చెప్పవచ్చు.
సీడెడ్ లో బాలయ్యకు ఉన్న ఫ్యాన్ బేస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలామంది టైర్1 హీరోలకు సైతం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య అఖండ2, బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ సైతం సీడెడ్ లో సంచలనాలు సృష్టించడం పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా కూడా బాలయ్య సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.
బాలయ్య డైలాగ్స్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అద్భుతమైన డైలాగ్ డెలివరీతో బాలయ్య అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుండటం గమనార్హం. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పాన్ ఇండియా హీరోగా బాలయ్య సక్సెస్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతుండగా ఏ సినిమాతో ఆ కోరిక తీరుతుందో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు