
అఖండ విజయం ఎప్పటికీ బాలయ్య మర్చిపోలేడు. కరోనా మూమెంట్లో థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేయాలి అంటేనే వణికిపోతున్న స్టార్స్ కు అండగా నిలచి తన సినిమా థియేటర్స్ తో రిలీజ్ చేసి 100 కోట్లు క్రాస్ అయ్యేలా చేసుకున్నాడు . ఇది నిజంగా వెరీ గ్రేట్ అనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి సినిమాకి సీక్వెల్ రాబోతుంది . ఈ సినిమాతో తాండవమే చూపించబోతున్నాడు బాలయ్య అంటూ రీసెంట్గా రిలీజ్ అయిన అప్డేట్స్ ఆధారంగా తెలుస్తుంది. కాగా రీసెంట్ గా జార్జియాలో పోరాటాలు కి సంబంధించిన సన్నివేశాలను మొత్తం పూర్తి చేసేశారు బాలయ్య.
ఇప్పుడు మరొక షెడ్యూల్ కోసం రంగంలోకి దిగేందుకు బాలయ్య సిద్ధమైపోయారు. అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ఈసారి తన నెక్స్ట్ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో ప్లాన్ చేసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలో సిద్ధం చేసిన ఒక ప్రత్యేక సెట్ లో ఈరోజు నుంచి బాలయ్య తన కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది . అంతేకాదు ఈ యాక్షన్ సీన్స్ తెరకెక్కించే దాని కోసం ఏకంగా బోయపాటి 15 కోట్లకు పైగానే ఖర్చు చేయిస్తున్నారట. ఇది చాలా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందట. సినిమాలో ఈ సీన్స్ ఇంకా హైలైట్ గా మారిపోతాయట . బాలయ్యలోని వెరీ వైల్డ్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచ్చంట గోపి అచ్చంట ఈ సినిమా ని ప్రొడ్యూస్ చేస్తున్నారు .తమన్ సంగీతం ఈ సినిమాని వేరే లెవెల్ లో మార్చేయబోతుంది అంటున్నారు నందమూరి అభిమానులు . ఈ సినిమాలో బాలయ్య మరోసారి అఘోర పాత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమైపోతున్నాడు..!