వరుస హిట్లతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కమిట్ అయిన సినిమా మెగా 157 . ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ రిలీజ్ అయినా లీక్ అయిన ఫ్యాన్స్ కళల్లో ఆనందం మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది. అనిల్ రావిపూడిసినిమా అయినా సరే ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసి ఎంజాయ్ చేసి నవ్వుకునే విధంగానే తెరకెక్కిస్తాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే.  ఆయన లాస్ట్ గా తెరకెక్కించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అన్న విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.


ఇప్పుడు చిరంజీవితో సినిమా తెరకెక్కిస్తున్నాడు.  ఇది కూడా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అంటూ క్లారిటీ వచ్చేసింది . ఈ సినిమాలో హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ సౌత్ ఇండియా క్రెజియస్ట్ హీరోయిన్ నయనతారను చూస్ చేసుకున్నారు . నయనతారని ఈ చిత్రంలో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తూ చేసిన వీడియో ఎంత హైలెట్ అయిందో అందరికీ తెలిసిందే . సాధారణంగా నయనతార సినిమా ప్రమోషన్స్ కి రాదు . అనిల్ రావిపూడి సినిమా పూజ కార్యక్రమాల నుంచే  ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు . మరి వీళ్ళిద్దరికీ ఎలా సెట్ అయింది అనేది ఇప్పటికి ఒక బిగ్  క్వశ్చన్ మార్క్ గానే ఉంది.  తాజాగా ఈ సినిమా షూటింగ్లో నయనతార పాల్గొనింది . ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఉత్తరాఖండ్ లోనొ ముస్సోరీలో జరుగుతుంది .



ఈ షెడ్యూల్ షూటింగ్లో హీరోయిన్ నయనతార కూడా రీసెంట్ గా జాయిన్ అయింది . ముసోరీలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు చిరు - నయన్ ల  మధ్య ఒక సాంగ్ కూడా షూట్ చేస్తున్నారట . ఈ సాంగ్ సినిమాకి చాలా ప్లస్ గా ఉండబోతుంది అంటూ కూడా తెలుస్తుంది.  కాగా షూటింగ్ సెట్లోకి వచ్చి రాగానే నయనతార చేసిన పని మెగాస్టార్ చిరంజీవి పరువు పోయినట్లు అయింది అంటూ ఓ న్యుస్ బాగా వైరల్ గా మారింది.  నయనతార - చిరంజీవిని హాయ్ అంకుల్ అంటూ పలకరించిందట .



చిరంజీవిని అంకుల్ అనడం పట్ల మెగా ఫాన్స్ తీవ్రంగా డిసప్పాయింట్ అవుతున్నారు.  చిరంజీవిని అంకుల్ అంటావా అంటూ రేంజ్ లో మండిపడుతున్నారు.  నయనతారను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.  నయనతార చాలా సరదాగా క్యాజువల్ గానే పిలిచింది . కానీ కొంతమంది మెగా ఫాన్స్ మాత్రం దీన్ని పెద్ద రాద్ధాంతంగా చేస్తూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు అంటూ కామన్ పీపుల్స్ కూడా మెగా ఫాన్స్ కి కౌంటర్ వేస్తున్నారు.  కొందరు చిరంజీవి పరువు పోయింది అంటుంటే మరికొందరు నయనతారను ట్రోల్ చేస్తున్నారు . కాగా ఇక ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తుండగా.. సాహు గారపాటి అలాగే చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: